పవన్ కి నెగిటివ్.. అయినా హోమ్ క్వారంటైన్ లోనే... టెన్షన్ లో ఫ్యాన్స్?
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు బలి తీసుకుంటున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతదేశంలో రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. కొన్ని నెలల క్రితం కరోనా ఉదృతి కాస్త తగ్గినట్లే అనిపించడంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ జనజీవనం యధావిధిగా మొదలయింది. అయితే ఎవరూ ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ అంటూ విరుచుకు పడింది.
2.0 పేరుతొ వచ్చి కరోనా మరోసారి విజృంభించింది. ఈసారి ఈ వైరస్ ప్రభావం సినీ ప్రముఖులపై ఎక్కువగానే ఉంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ హీరో పవన్ కు కరోనా సోకడం చర్చనీయాంశంగా మారింది.

వకీల్ సాబ్ సినిమాతో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకుంటూ పవన్ ఫ్యాన్స్ కు మరిచిపోలేని గిఫ్ట్ గా మారింది. అయితే ఈ సినిమాతో హిట్ కొట్టిన అని ఆనందాన్ని ఆస్వాదించే లోపు పవన్ కళ్యాణ్ కు కరోనా సోకడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళనలో మునిగిపోయారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు, తిరుపతి ప్రచారంలో పాల్గొన్న పవన్ కి కరోనా సోకింది.

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్
దానికి తగ్గట్టుగా ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ తీసుకుంటూ ఉన్న ఆయన పిక్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం ఆ వెంటనే వైరల్ గా మారడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. అయినా సరే ఆయన హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ శంకరపల్లి సామ్ హౌస్ లోనే ఇంకా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

కరోనా నెగిటివ్ వచ్చింది కానీ
అయితే ఆయనకు కరోనా నుంచి ఉపశమనం లభించింది సరే ఊపిరితిత్తుల సమస్య నుంచి ఇంకా ఉపశమనం లభించలేదని తెలుస్తోంది. అందుకే ఇంకా క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి పవన్ కు కరోనా లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయట. కానీ ఊపిరితిత్తుల సమస్య ఇంకా బాధ పెడుతోందని సీటీ స్కాన్ తీయించినా సరే అందులో ఏమి తేడాగా రాలేదని చెబుతున్నారు. దీంతో ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.

పూర్తిగా కోలుకున్నాకే
దీంతో ఆయనకు మళ్లీ ఒకసారి సీటీ స్కాన్ చేయించనున్నారని తెలుస్తోంది. ఆ సీటీ స్కాన్ చేయించక వచ్చే పరీక్ష ఫలితాలను బట్టి వైద్యులు సూచనలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ పూర్తిగా కోలుకున్నాక ఫాంహౌస్ నుంచి బయటకు వస్తారని అప్పటివరకు ఫాంహౌస్లోనే ఆయన ఉంటారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











