పవన్ ప్రొడ్యూసర్ గా మారటానికి కారణం?

అలాగే వరసగా సినిమాలు తీయటం కోసం ఫండ్స్ చేయటానికి కొందరితో టై అప్స్ అవనున్నారని,అయితే తన ఆలోచనలతో కలసే వారినే చేర్చుకుంటారని వినపడుతోంది. అలాగే సొంత బ్యానర్ ఏర్పాటు చేయటం ద్వారా ఇండుడ్యువాలిటీ కీ ,సొంత నిర్ణయాలకు ఆస్కారం ఉంటుందని, తన భావాలకు దగ్గరగా ఉండే తరహా చిత్రాలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారుట.
ఇప్పటికే ఆ కుటుంబంలో ఉన్న అంజనా ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ లలో సినిమాలు చేసేటప్పుడు పూర్తిగా వారికి డబ్బు నష్టపోకుండా చూడాల్సిన భాధ్యత తనపై ఉంటుందని ...దాంతో కొంత వరకూ కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందని అందుకే సొంత బ్యానర్ లో అయితే ఆ ఇబ్బంది ఉండదని సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా బ్యానర్ రిజిస్ట్రేషన్ జరిపి వార్తను వెళ్ళడించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











