‘తుఫాన్’ సృష్టించబోతున్న పవన్ కళ్యాణ్?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ ఖరారు కాలేదు. 'సరదా', 'హరే రామ హరే కృష్ణ' టైటిల్స్ వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్ర దర్శక నిర్మాతలు టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఆ సంగతి అలా ఉంచితే.... తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రస్తుతం 'తుఫాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఏది ఏమైనా అధికారికంగా ఖరారు అయితే తప్ప దీన్ని నమ్మలేం. జనవరి 22 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈచిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు.
చిత్రం షూటింగ్ కోసంరామోజీ ఫిల్మ్ సిటీలో ఓప్రత్యేకమైన సెట్ ని వేయిస్తున్నారు. నిర్మాత బి.విఎస్ ఎన్ ప్రసాద్ దగ్గరుండి ఈ సెట్ ని పర్యవేక్షిస్తున్నారు. ఈ సెట్ లో ఓ పాటను తీయనున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ని ఈ సెట్ లో ప్రారంభిస్తారు. ఇప్పటికి దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం అదరిపోయే సాంగ్స్ కంపోజ్ చేసాడని, పవన్ చాలా ఉత్సాహంగా ఈ షూటింగ్ పాల్గొనటానకి రెడీ అవుతున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











