ఆ హీరోకి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో కొరియోగ్రఫీ !
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్...ప్రత్యేక శ్రద్ద, పర్యవేక్షణ గబ్బర్ సింగ్ 2 సినిమాకు కదా..దాంట్లో వింతేముంది అనుకుంటున్నారా... అది కాకుండా ఆయన సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ తెరంగేట్రం విషయంలో ప్రతీ విషయంలో పవన్ జాగ్రత్తలు తీసుకుని భాధ్యత వహిస్తున్నాడు. చాలా కాలం నలిగిన వరుణ్ తేజ ఎంట్రీ ఎట్టకేలకు ఖరారైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలోనే వరుణ్ తెరకు పరిచయం కాబోతున్నాడు. అందుకోసం అన్నీ పక్కాగా సిద్ధం చేసేశారు.
మొదటగా చిరంజీవి కథ విని ఈ ప్రాజెక్టుని ఓకే చేశారట. పవన్ కల్యాణ్ పాటలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచబోతున్నారట. ఆయనే దగ్గరుండి ఈ పాటని డిజైన్ చేయబోతున్నారని సమాచారం. అలాగే మ్యూజిక్ సిట్టింగ్ లలో కూర్చుని పాట ఓకే చేయటం,డాన్స్ డైరక్టర్ తో మూవ్ మెంట్స్ వంటి విషయాల్లో ఆయన ఇన్వాల్స్ అవుతున్నారనని ఫిల్మ్ నగర్ సమాచారం.
వరుణ్‌తేజ్ తెరంగేట్రం గురించి ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. మొదట్లో... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నాడనీ, 'గొల్లభామ' పేరుతో ఆ చిత్రం తెరకెక్కబోతోందనీ ప్రచారం సాగింది. ఎందుకో తెలియదు కానీ... మళ్లీ పూరి జగన్నాథ్, క్రిష్ పేర్లు తెరపైకొచ్చాయి. ఇప్పుడు మళ్లీ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలోనే సినిమా ఖరారైంది.
జనవరి 1న ఈ చిత్రాన్ని భీమవరంలో ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఈ కథ కూడా గోదావరి నేపథ్యంలో సాగుతుందట. మరి ఇదివరకు అనుకొన్న 'గొల్లభామ' కథతోనే ఈ చిత్రం తెరకెక్కుతుందా? లేదంటే మార్చారా అన్నది తేలాలి. అలాగే ఈ చిత్రం కోసం వరుణ్ తేజ...ప్రత్యేకమైన తూర్పు గోదావరి యాస ని మాట్లాడనున్నాడని,అందుకోసం ప్రాక్టీస్ చేస్తున్నాడని, టీనేజ్ లవ్ స్టోరీ ఈ చిత్రం అని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications












