మళ్ళీ దగ్గరవుతున్న పవన్, త్రివిక్రమ్.. కానీ సినిమా అంటే కష్టమే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కాంబినేషన్ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లదే అని చెప్పవచ్చు. కేవలం సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీరిద్దరు మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. అయితే రాజకీయాల కారణంగా అనుకోని విధంగా ఈ ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చేసింది. అజ్ఞాతవాసి తరువాత మళ్ళీ ఎక్కువగా కలుసుకునే అవకాశం రాలేదు. అయితే ఈ లాక్ డాన్ కాలంలో ఎప్పటిలానే రెగ్యులర్ గా కలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Vakeel Saab Director Venu Sriram About Trivikram Srinivas
 అజ్ఞాతవాసి ఎఫెక్ట్..

అజ్ఞాతవాసి ఎఫెక్ట్..

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య విబేధాలు వచ్చినట్లు అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ముందు అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ గట్టి ప్రభావమే చూపించింది. అప్పటి నుంచే పవన్, త్రివిక్రమ్ కి దూరమయ్యాడు అని రూమర్స్ వచ్చాయి. అప్పుడప్పుడు ఎదో ఒక విధంగా ఇద్దరు కలుసుకున్నప్పటికి రూమర్స్ డోస్ తగ్గలేదు.

మళ్ళీ దగ్గరవుతున్నారు

మళ్ళీ దగ్గరవుతున్నారు

కరోనా వైరస్ కారణంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా బయటకు వెళ్లడం లేదు. ప్రస్తుతం తన ఫామ్ హౌజ్ లోనే ఉంటున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా షూటింగ్స్ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ని రెగ్యులర్ గా కలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా నితిన్ పెళ్లికి కూడా ఇద్దరు కలిసే వెళ్లడంతో మళ్ళీ దగ్గరవుతున్నారు అని అభిమానులకు కూడా క్లారిటీ వచ్చేసింది.

సినిమా అంటే కష్టమే..

సినిమా అంటే కష్టమే..

ఇక వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బావుంటుందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ సినిమా ఇచ్చిన త్రివిక్రమ్ ఆ మచ్చను తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పవన్ కోసం ఎప్పుడు కథను రాస్తాడో తెలియదు గాని ఇప్పటికైతే వీరి కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

ఇప్పట్లో అయితే లేనట్లే..?

ఇప్పట్లో అయితే లేనట్లే..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. వకీల్ సాబ్ నెక్స్ట్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అనంతరం క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అలాగే హరీష్ శంకర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూడు సినిమాలు అయిపోతే గాని పవన్ మరో సినిమాను ఒకే చేసేలా లేడు. కరొనా కారణంగా ఇప్పటికే సమయం చాలా వేస్ట్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ కూడా మరో రెండు మూడు ప్రాజెక్టులకు కమిట్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఇప్పట్లో అయితే పవన్ తో సినిమా చేసే ఛాన్స్ లేదని క్లియర్ గా అర్థమవుతొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X