త్రివిక్రమ్ సినిమాలో పవన్ లుక్ ఇదే!?(ఫోటో)
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మొదలైన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ లుక్ పై అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో ఆయన ఎలా కనిపించనున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఆయన్ని ఓ అభిమాని ఈ చిత్రం సెట్ మీద కలిసినప్పుడు తీసిన ఈ ఫోటో బయిటకు వచ్చి ఫ్యాన్స్ ని అలరిస్తోంది. దాంతో పవన్ ఈ గెటప్ లో ప్రెష్ గా, న్యూ లుక్ తో కనిపించనున్నారని అంతటా ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రానికి నిర్మాత. జల్సా తరహాలో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగు స్పెయిన్లో ప్లాన్ చేసారు. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈ చిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు దర్శకుడు త్రివిక్రమ్.
ఈ చిత్రానికి సరదా', 'హరే రామ హరే కృష్ణ' టైటిల్స్ వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్ర దర్శక నిర్మాతలు టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ సంగతి అలా ఉంచితే.... తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రస్తుతం 'తుఫాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఏది ఏమైనా అధికారికంగా ఖరారు అయితే తప్ప దీన్ని నమ్మలేం.


Click it and Unblock the Notifications











