‘అత్తారింటికి దారేది' లో పవన్,సమంత డైలాగ్
ఈ చిత్రంలో డైలాగు అంటూ ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది...అదేమిటంటే...
సమంత: నువ్వు చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావు
పవన్: చూడు..జానూ..స్వార్ధంగా ఆలోచించటం మనకు స్కూల్ డేస్ నుంచి అలవాటు చేసారు. అశోకుడు రోడ్ కి రెండు వైపులా చెట్లు నాటించెను అని చెప్తారు కానీ ఆ మధ్యలో ఉన్న రోడ్డు బ్రిటీష్ వాడు బాగు చేసెను అని ఏ బుక్ లో అయినా చెప్తారా...
ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. ఇక పవన్ కల్యాణ్‌లోని అల్లరినీ, ఆవేశాన్ని సమపాళ్లలో చూపించారు త్రివిక్రమ్.. 'జల్సా' సినిమాలో. సంజయ్ సాహూగా పవన్ నటన ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు వీరిద్దరూ పూర్తిస్థాయి వినోదాత్మక కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ యూరఫ్ లో ప్లాన్ చేసారు. జూన్ మొదటి వారంలో అక్కడ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మొత్తం 25 రోజుల పాటు వివిధ లోకేషన్లలో షూటింగ్ జరుపాలని నిర్ణయించారు. ఈ మేరకు యూరప్ లోని లొకేషన్ల గురించి ఆరా తీస్తున్నారు. రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












