»   » పవన్ చిత్రానికి ‘అత్తారింటికి దారేది’ టైటిల్ కాదా మరి...

పవన్ చిత్రానికి ‘అత్తారింటికి దారేది’ టైటిల్ కాదా మరి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి 'అత్తారింటికి దారేది' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే టైటిల్ మరీ క్లాస్ గా ఉందని అభిమానులనుంచి ఒత్తిడి రావటంతో టైటిల్ మార్చినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఈ సారి టైటిల్ ని చిరంజీవి హిట్ చిత్రం టైటిల్ తో ముడిపెడుతున్నారు.

చిరంజీవి కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన అల్లుడా..మజాకా చిత్రం టైటిల్ ని చిన్న మార్పుతో ఈ చిత్రానికి పెట్టనున్నారని చెప్పుకుంటున్నారు. ఆ మార్పుతో వచ్చే టైటిల్ ఏమిటంటే..చిన్న అల్లుడా ...మజాకా. ఈ టైటిల్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుందని, మాస్ లుక్ తో ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇది రూమరా...నిజమా అని తేలాల్సి ఉంది.

ఇక ఈ చిత్రం యూరప్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల చివర్లో చిత్ర యూనిట్ యూరఫ్ వెళ్లనుంది. జూన్ నెల మొత్తం వివిధ లోకేషన్లలో షూటింగ్ జరుపాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్‍‌లో జరుగుతున్న షూటింగ్ ఈ నెల 28తో ముగియనుంది.

ఈ షెడ్యూల్ లో మొత్తం 3 పాటలు చిత్రీకరించనున్నారు. అందులో ఒకటి పవన్ సోలో సాంగ్ కాగా...హీరోయిన్లు సమంత, ప్రణీతలతో కలిసి డ్యూయెట్ సాంగ్ చిత్రీకరించనున్నారు. అదే విధంగా టాకీ పార్టుకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఇక్కడ షూట్ చేయనున్నారు.

ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తం 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

English summary
Pawan Kalyan is starring in the direction of Trivikram Srinivas along with Samantha and Pranitha. Film makers considering titles Sarada and Hare Rama Hare Krishna,Attarintiki Daredi but nothing has been finalised. According to the latest, they are contemplating the name 'Alluda Majaka'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu