ఓ రేంజిలో ట్విస్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: ఇప్పుడు పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. ఆయన తెలుగులో రజనీకాంత్ తరహాలో అభిమానులను సంపాదించుకున్నారు. ఏ హీరో ఫామ్ లో ఉంటే కార్పోరేట్ ప్రపంచం ఆ హీరో వెనక పడి తమ ఉత్పత్తలకు యాడ్స్ చేయించుకుని,బిజినెస్ పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు పెద్ద సంస్ధల దృష్టి మొత్తం పవన్ కళ్యాణ్ పై పడింది. త్రివిక్రమ్ తో ఆయన చేసిన అత్తారింటికి దారేది చిత్ర ఘన విజయంతో వారంతా ఇప్పుడు పవన్ దగ్గర క్యూ కట్టారు. అయితే వారందరికీ పవన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చి డైలమాలో పడేసారు. దాంతో ఆయన ప్రమోట్ చేస్తే..ఆయన అభిమానులు ద్వారా కొత్త మార్కెట్ కి బీజం వేసుకోవచ్చు అనే వారి స్టాటజీలకు గండి కొట్టినట్లైంది. ముఖ్యంగా పవన్ పై ఎంతో ఆశలు పెట్టుకున్న ఓ పాపులర్ సాప్ట్ డ్రింక్ కంపెనీకు ఆయన చెప్పిన ఈ మాటలు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయంటున్నారు.
సదరు కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంటేనే ప్రమోట్ చేస్తానని నిక్కిచ్చిగా చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఆ కంపెనీలు వారు తమ ఉత్పత్తులు వల్ల ఉపయోగాలు ఉన్నాయంటూ ప్రత్యేకంగా పవన్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సాప్ట్ డ్రింక్ లు,కాస్మోటిక్ ప్రొడక్ట్స్ వల్ల ప్రత్యేకంగా ఉపయోగం ఏముంటుంది అంటే చెప్పలేని పరిస్ధితి. అటు పవన్ ని వదులుకోలేరు. ఇటు ఒప్పించి తమ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేసుకోలేని పరిస్ధితి ఏర్పడింది.గతంలో పెప్సి లాంటి సాఫ్ట్ డ్రింకు కంపెనీల తరుపున పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. కారణం ఏమిటో తెలియదు కానీ...చాలా కాలంగా పవన్ కళ్యాణ్ వాణిజ్య ప్రకటనల ప్రమోషన్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఓకే అంటే కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చి ప్రచారం చేయించుకోవడానికి పలు కార్పొరేట్ సంస్థలు రెడీగా ఉన్నాయి. కానీ పవన్ మాత్రం వాటికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నా..కార్పోరేట్ కంపెనీలు మాత్రం భోరుమంటున్నాయి.


Click it and Unblock the Notifications
