పవన్ మల్టీస్టారర్ కథలో.. అతనే ఫిక్స్ అయ్యేలా ఉన్నాడు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ కథలకు ఈ మధ్య రెస్పాన్స్ గట్టిగానే వస్తోంది. హీరోలు ఈగోలను పక్కనపెట్టి ఇతర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటే అభిమానుల సంఖ్య పెరగడమే కాకుండా మినిమమ్ బాక్సాఫీస్ హిట్ అందుకోవచ్చని ఆలోచిస్తున్నారు. ఇక చాలా రోజుల తరువాత సినిమా షూటింగ్స్ తో బిజీగా మారుతున్న పవర్ స్టార్ ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మలయాళం హిట్టు సినిమా అయ్యప్పన్ కొశీయుమ్ రీమేక్ కు దర్శక నిర్మాతలు చాలా పవర్ఫుల్ గా రెడీ అవుతున్నారు.

సినిమాను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేయాలని పవన్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చాడు. దీంతో పక్కా ప్లాన్ తో షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు దర్శకుడు సాగర్ చంద్ర. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాలో మరో హీరో ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పోలీస్ పాత్రలో పవన్ నటిస్తున్నట్లు ఎనౌన్స్మెంట్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌజ్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ మరో హీరో పాత్రపై మాత్రం కొంచెం కూడా క్లారిటీ ఇవ్వలేదు. నితిన్, సాయి ధరమ్ తేజ్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి గాని ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు.

 Pawan kalyan upcoming malayalam remake second hero confirmed

అయితే ఫైనల్ గా రానా ఫిక్స్ అయ్యేలా ఉన్నాడని తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా ఆ ప్రాజెక్టుకి సంబంధించిన చర్చలు జరిగినట్లు చెప్పాడు. దర్శక నిర్మాతలతో మాట్లాడడం జరిగిందని అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం ఫైనల్ కాలేదని చెప్పాడు. దీంతో రానా చర్చల అనంతరం అన్ని ఒకే అయిన తరువాత ఎనౌన్స్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి సినిమాను సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X