పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. మొత్తానికి ఆ రోజు సరికొత్త ట్రీట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా వకీల్ సాబ్. మొదటి నుంచి కూడా సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పుడో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా థియేటర్స్ తెరచుకోవడంతో సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పుడైనా క్లారిటీ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజూ బోణి కపూర్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అసలైతే సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా డోస్ తగ్గేవరకు రిస్క్ చేయకపోతేనే బెటర్ అని మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

Pawan kalyan upcoming movie vakeel saab latest update

ఇక ఫైనల్ గా న్యూ ఇయర్ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఇదొక రూమర్ అనే టాక్ వచ్చింది. కానీ ఇటీవల చిత్ర యూనిట్ జరిపిన చర్చల్లో టీజర్ పై కూడా ఒక క్లారిటికి వచ్చినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు కిక్కిచ్చేలా టీజర్ ను విడిదల చేయాలని చూస్తున్నారట. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. మరో ఆ టీజర్ సినిమాపై ఇంకా ఏ స్థాయిలో అంచనాలను పెంచుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X