లాక్ డౌన్ దెబ్బకు పవన్ సినిమాలో భారీ మార్పులు.. అసలైందే లేపేశారు?

కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఊపిరి పీల్చుకొనివ్వకుండా చేస్తున్న ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి అన్ని దేశాలు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నాయి. ఇక ఆర్థికంగా సినిమా ఇండస్ట్రీలలో కూడా భారీ నష్టాలు చోటు చేసుకుంటున్నాయి. కోట్లు ఖర్చు చేసి రెడీ చేసుకున్న ప్రణాళికలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. టాలీవుడ్ లో నిర్మాతలు తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింది.

Recommended Video

Vakeel Saab : Key Changes In Pawan Kalyan's Vakeel Saab Movie
కరోనా తగ్గినా..

కరోనా తగ్గినా..

కరోనా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ తగ్గినా ఆ ప్రభావం నుంచి కొలుకోవడానికి ఎంత సమయమైన పట్టవచ్చు. ఇక సినిమా రంగంలో చాలా వరకు సినిమా రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయి. రిలీజ్ చేస్తే లాక్ డౌన్ తరువాత జనాలు థియేటర్ కి వచ్చే అవకాశం కూడా లేదు. ఒకవేళ వచ్చినా గతంలో మాదిరిగా సినిమా హాల్లో జనాలు దర్శనమివ్వడం కష్టమే..

 పవన్ సినిమాపై ఎఫెక్ట్..

పవన్ సినిమాపై ఎఫెక్ట్..

ఇటీవల మొదలైన పవన్ కళ్యాణ్ రెండు సినిమాలకు సడన్ గా బ్రేకులు పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా నిర్మాతలు చేసుకున్న ప్లాన్స్ చేదిరిపోయాయి. పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక హిస్టారికల్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే అందులో ఒక సీన్ కోసం క్రిష్ నార్త్ ఆఫ్రికాలోని మొరాకోలో ఒక భారీ సెట్ ని ప్లాన్ చేశాడట. అదే యాక్షన్ క్లైమాక్స్ అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవడమే కాకుండా మొరాకో షెడ్యూల్ ని కూడా క్యాన్సిల్ చేశారట. హైదరాబాద్ లొనే కొన్ని మార్పులతో మరొక షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకున్నారట.

 హీరోయిన్ లేనట్లే?

హీరోయిన్ లేనట్లే?

పింక్ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న 'వకీల్ సాబ్' సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా బ్రేకులు పడ్డాయి. హీరోయిన్ కి సంబంధించిన సీన్స్ ని ఫినిష్ చేయాల్సి ఉందట. అయితే కరోనా కారణంగా ఆలస్యం అవుతుండడంతో హీరోయిన్ కి సంబంధించిన సీన్స్ అవసరం లేదని నిర్మాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 పవన్ కూడా పట్టించుకోవట్లేదట..

పవన్ కూడా పట్టించుకోవట్లేదట..

ఇకపోతే వకీల్ సాబ్ కథలో హీరో పాత్రకు జోడిగా నటించే నటిమణికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదని ఆ పాత్రని లేపేసే ఆలోచనలో ఉన్నారట. పవన్ కూడా ఈ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని సమాచారం. ఎందుకంటే పవన్ సినిమాలకు సైన్ చేసినప్పుడే దర్శకుడికి నిర్మాతకు ఒక మాట చెబుతున్నారట. సినిమా షూటింగ్, డబ్బింగ్ పనులకు మాత్రమే వస్తానని మిగతా విషయాల్లో చర్చించే టైమ్ కూడా తనకు లేదని ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X