సంక్రాంతి బరిలో పవన్ సినిమా.. మహేశ్, ప్రభాస్‌ సినిమాలపై ఎఫెక్ట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా వచ్చినా.. తనదైన యాక్టింగ్, స్టైల్స్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ముఖ్యంగా రీఎంట్రీలో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ సత్తా చాటుతోన్నాడు. ఇలా ఇప్పుడు ఏకకాలంలో నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ బిజీగా గడుపుతోన్నాడు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఒకటి.

వాస్తవానికి 'వకీల్ సాబ్' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే పవన్ కల్యాణ్.. హరీష్ శంకర్‌తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమాను చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. కానీ, ఈ మూవీని మాత్రం చాలా కాలం పాటు హోల్డులోనే ఉంచేశాడు. దీంతో ఈ ప్రాజెక్టును పవన్ పక్కన పెట్టేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే దీన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఆరోజే పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసి అనుమానాలను పటాపంచలు చేసింది. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిలిం సర్కిళ్లలో వైరల్ అవుతోంది.

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Release on Sankranti 2024

పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కలయికలో రాబోయే సినిమాను ఇంకా ప్రారంభించలేదు. అయితే, దీన్ని ఏప్రిల్ 5వ తేదీ నుంచి పట్టాలెక్కించబోతున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇక, ఈ సినిమా రిలీజ్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతోన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటనను సినిమాను మొదలెట్టే ఏప్రిల్ 5వ తేదీన వెల్లడించబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన ప్రభాస్ 'ప్రాజెక్టు K', మహేశ్ - త్రివిక్రమ్ సినిమాలపై ప్రభావం పడనుంది.

ఇదిలా ఉండగా.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X