ఉస్తాద్ భగత్ సింగ్.. హరీశ్ శంకర్ కు పవన్ కళ్యాణ్ ఆర్డర్స్.. ఏం చెప్పాడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలు ఇచ్చిన తీర్పుతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో తాను ఎన్నికలకు ముందు సైన్ చేసిన సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆ సినిమాలను పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా తన సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో లేటెస్ట్ అప్డేట్ వివరాల్లోకి వెళితే..

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం..
గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాష్ ఇన్ డైరెక్టర్ హరిశ్ శంకర్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రావలసిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం 2022లో అధికారికంగా ప్రకటించబడింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించేందుకు పూనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూలు కారణంగా పలుమార్లు షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కొన్ని కీలకమైన మార్పులు చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ ను పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు తెలుస్తోంది.

Pawan Kalyan Ustaad Bhagat Singh movie Story Changed

పవన్ కళ్యాణ్ చెప్పిన మార్పులు..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండడం, ప్రజలకు సేవ చేస్తున్నందున, ప్రజలు మెచ్చేలా తన సినిమాలు ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంగా పవన్ కళ్యాణ్ తన రాబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కథ విషయంలో మార్పులు చేయాలని ఆదేశించారంట. ఈ చిత్రంలోని రొమాన్స్ సీన్లు, పలు డైలాగ్స్ మార్చాలని చెప్పారంట. ప్రజా క్షేత్రంలో పనిచేస్తున్నందున ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు రాకుండా ఉండేందుకు కథను మార్చేయాలని అభిప్రాయపడ్డారంట. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం టీం కథను మార్చే పనిలో నిమగ్నమై ఉందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ నుంచి రావలసిన సినిమాలు..
పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీ అవడం కారణంగా మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని షూటింగ్ ప్రారంభమై మధ్యలోనే ఆపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మళ్లీ షూటింగ్ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు.

తాడేపల్లిలో ఓజీ పనులు..
మరోవైపు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా తాడేపల్లిలో జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విదేశాల్లో తీయాల్సిన షూటింగ్స్ ను తాడేపల్లిలోనే ప్రత్యేకమైన సెట్స్ వేసి తీయబోతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రస్తుతం పూర్తి చేసుకునే దిశగా పరుగులు పెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ విక్టరీ తర్వాత ఆయన్ని బిగ్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెక్ట్స్ రిలీజ్ ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X