Don't Miss!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. కేవలం 20రోజులే..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తరువాత వస్తున్న చిత్రం వకీల్ సాబ్. గతంలో ఎప్పుడు లేని విధంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ ఈ సారి ఎలాగైనా బాక్సాఫిస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేయడానికి చిత్ర యూనిట్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 20రోజుల షూటింగ్ మిగిలి ఉండడంతో సెప్టెంబర్ లో ఎలాగైనా షూటింగ్ ని స్టార్ట్ చేసి అనుకున్న సమయానికి ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ ముందుగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ని పూర్తి చేసి అనంతరం ప్రీ క్లైమ్యాక్స్ కి సంబంధించిన సీన్స్ ని షూట్ చేయనున్నాడట.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సినిమాకు సంబంధించిన మరొక స్పెషల్ లుక్ ని కూడా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదే విదంగా సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే మరో రెండు ట్యూన్స్ ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒక పాటను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..