పవన్ కళ్యాణ్ సినిమాకు OTT ఆఫర్.. దిల్ రాజు మళ్ళీ అలానే చేస్తాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా గాయాన్ని అభిమానులు ఇంకా మారచిపోలేదు. ఇక వకీల్ సాబ్ సినిమాతో ఎలాగైనా మళ్ళీ పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనేలా సక్సెస్ ని ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఈ పాటికె సినిమా విడుదలై రికార్డులు క్రియేట్ చేసి ఉండేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇక వకీల్ సాబ్ షూటింగ్ కొంత మిగిలి ఉన్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా అంటే మరో 15 రోజుల్లో పనులను పూర్తి చేసుకొని ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ అవ్వాలని చిత్ర యూనిట్ ఆలోచించుకుంటోంది. ఈ సినిమాను ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు చాలా గట్టిగా డిసైడ్ అయ్యాడు. కానీ ఓటీటీ సంస్థలు ఊరించే ఆఫర్స్ వదులుతున్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఒక ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ సంస్థ ఓటీటీ హక్కుల కోసం రూ.80కోట్ల వరకు ఆఫర్ చేసిందట. అలాగే మరో పెద్ద సంస్థ కూడా పోటీకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు V సినిమాను తప్పక అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాల్సి వచ్చింది. ఒక విధంగా ఆ సినిమా 15కోట్లకు వరకు ప్రాఫిట్స్ ని అందించింది. ఇక పవన్ కళ్యాణ్ తో మొదటిసారి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాపై పెట్టుబడులు గట్టిగానే పెట్టారు.
ఎలాగైనా థియేటర్స్ లో రిలీజ్ చేసి డబుల్ ప్రాఫిట్స్ అందుకోవాలని చూస్తున్నారు. కానీ ఓటీటీ సంస్థలు బడ్జెట్ కంటే ఒక 20% ఎక్కువ లాభం ఉండేవిధంగా డీల్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇక పరిస్థితులు చక్కబడితే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఓటీటీ ఆఫర్స్ కూడా ఎక్కువవుతున్నాయి. మరి ఈ సినిమా విషయంలో దిల్ రాజు ఎలాంటి ఆలోచనతో ఉన్నరో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











