పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ రిలీజ్ తేదీపై క్లారిటీ వచ్చినట్లే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా పనులన్నీ దాదాపు ఏండింగ్ లోకి వచ్చేశాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ లాయర్ గా సరికొత్త పాత్రలో కనిపిస్తుండడంతో అంచనాలు కూడా గట్టిగానే పెరిగాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.
అసలైతే సంక్రాంతికి ఎలాగైనా వకీల్ సాబ్ వస్తాడని మొన్నటివరకు గాసిప్స్ గట్టిగానే వచ్చాయి. అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఆ గాసిప్ ద్వారా కాస్త ఆశలు పెరిగాయి. అయితే ఆ డోస్ ఇంకా ఎక్కువ కాకముందే దిల్ రాజు టీమ్ క్లారిటీ ఇవ్వడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. ఏప్రిల్ నాటికి అంతా సర్దుకుంటుందని అప్పుడే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఇక రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలి అంటే ముందుగా థియేటర్స్ రెగ్యులర్ గా నడవాలని చాలా మంది నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. దిల్ రాజు కూడా అప్పుడే ఒక నిర్ణయానికి రావాలని డిసైడ్ అయినట్లు టాక్ వస్తోంది. సమ్మర్ లో పెద్ద సినిమాల హడావుడి గట్టిగానే కనిపించనున్నట్లు మరోసారి అర్ధమయ్యింది. మెగాస్టార్ ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్ కూడా సమ్మర్ ని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వకీల్ సాబ్ ఏప్రిల్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











