పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. థియేటర్‌లో వకీల్ సాబ్ ట్రైలర్.. ఎప్పుడంటే?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటి. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ ముందుగా పింక్ రీమేక్ తో హిట్టు కొట్టడానికి రెడీ అయ్యాడు. ఇక అందరిచూపు ప్రస్తుతం ట్రైలర్ పైనే ఉంది. ఇక చిత్ర యూనిట్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. ముందుగా ట్రైలర్ ను థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

పవన్ అభిమానులకు నచ్చేలా..
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అనంతరం చాలా గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎందుకంటే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలానే ఉన్నాయట. పవన్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని అసలు కథతోనే కొత్తగా స్క్రిప్ట్ డిజైన్ చేశారట.

పనులన్నీ పూర్తి చేసుకొని..
సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ కూడా పెంచారు. అసలైతే గత ఏడాది సమ్మర్ లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక మళ్ళీ ఏడాది అనంతరం సినిమా పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్ 9న థియేటర్స్ లోకి రావడానికి సిద్ధమైంది.

భారీ స్థాయిలో బిజినెస్
సినిమాకు సంబంధించిన మార్కెట్ పై రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు మార్కెట్ రేంజ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా పెరుగుతుంది. ఇక ఇప్పుడు వకీల్ సాబ్ కూడా ఈజీగా 100కోట్ల బిజినెస్ చేయనున్నట్లు టాక్. సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేశాయి.

ట్రైలర్ డేట్ ఫిక్స్
ఇక నెక్స్ట్ అసలైన ట్రైలర్ తో మరింత బజ్ క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేసుకున్నారు. సినిమా ట్రైలర్ ను మార్చి 24వ తేదీన థియేటర్స్ లో సాయంత్రం 5:30కి విడుదల చేసి అదే రోజు యూ ట్యూబ్ లో 6:30గంటలకు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ట్రైలర్ ను కట్ చేసి రెడీగా ఉంచినట్లు తెలుస్తోంది. చూసిన కొంతమంది చిత్ర యూనిట్ సభ్యులు పవర్ స్టార్ రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











