twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ ఉన్న దర్శకుడితో వెంకటేష్, పవన్ కళ్యాణ్ జంటగా!

    By Sindhu
    |

    తెలుగులో మల్టీ స్టార్రర్ చిత్రాలు తక్కువవుతున్న తరుణంలో విక్టరీ వెంకటేష్ ఈ మద్య 'ఈనాడు" చిత్రంతో అటువంటి చిత్రాలకు తెరలేపిన విషయం తెలిసిందే. వెంకీ త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

    అన్నీ కదిరితే ఈ సమ్మర్ కే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. గతంలో దిల్ రాజు బ్యానర్ లో 'కొత్తబంగారులోకం" చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు..పవన్, వెంకీలతో విడివిడిగా చిత్రాలు చేయాలనే కోరికతో ఉన్న దిల్ రాజు కోరికను తీర్చడానికి ఆ చిత్రం తర్వాత శ్రీకాంత్ అడ్డాల మరో చిత్రానికి పనిచేయకుండా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే చిత్రానికి కథ తయారు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో నటించుటకు ఓకే చెప్పినట్లుగా సమాచారం.

    అలాగే పవన్, వెంకీ స్వతహాగా మంచి ఫ్రెండ్స్ కావడంతో, గతంలో వెంకీతో సినిమాకు దర్శకత్వం చేస్తానని తెలపడంతోనూ పవన్ కూడా ఈ చిత్రానికి ఓకే చెప్తాడని పరిశ్రమ వర్గాల సమాచారం. సో దిల్ ఉన్న దర్శకుడితో వెంకీ, పవన్ ల కాంబినేషన్ లో ఓ మంచి చిత్రం వస్తుందని ఊహించవచ్చు. కాబట్టి త్వరలో వెంకీ, పవన్ అభిమానులకు పండగే పండుగ అంటున్నారు విమర్శకులు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X