Vinodhaya Sitham: పవన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ డేనే ఎందుకంటే!

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. అప్పటి నుంచి వరుస పెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించిన ఈ మెగా హీరో.. ఇప్పుడు ఏకకాలంలో మూడు నాలుగు ప్రాజెక్టులను చేతిలో పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. అయినప్పటికీ మరిన్ని సినిమాలను చేసేందుకు సన్నద్ధం అవుతోన్నాడు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే 'వినోదయ సీతమ్' రీమేక్ మూవీని కూడా మొదలు పెట్టేశాడు.

తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి ZEE5 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాకు సముద్రఖని డైరెక్టర్‌గా చేయడంతో పాటు అందులో ప్రధాన పాత్రను కూడా పోషించారు. ఇప్పుడిదే సినిమాను పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. దీనికి సముద్రఖని దర్శకత్వం చేస్తున్నారు. ఇక, ఈ మూవీలో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ మెగా మల్టీస్టారర్ మూవీపై అప్పుడే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అభిమానులను ఖుషీ చేసే ఓ న్యూస్ లీకైంది.

Pawan Kalyan Vinodhaya Sitham Remake Release on August 15th

పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'వినోదయ సీతమ్' రీమేక్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. ఇందుకోసం పవర్ స్టార్ కేవలం 30 రోజులు డేట్స్ మాత్రమే కేటాయించినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రాన్ని మే చివరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారని అంటున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారట. ఈ హాలీడే‌కు తోడు లాంగ్ వీకెండ్ ఉండడంతో కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఈ కొద్ది రోజుల్లోనే రాబోతుందని తెలిసింది.

Pawan Kalyan Vinodhaya Sitham Remake Release on August 15th

ఇద్దరు మెగా హీరోలు కలిసి నటిస్తోన్న ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్‌ను చేస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రను చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X