PKSDT: మెగా ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్.. టైటిల్ పోస్టర్ డేట్ ఫిక్స్
సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయినప్పటి నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూ ఏ స్టార్ హీరోకూ సాధ్యం కాని రీతిలో దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడే చేతిలో నాలుగైదు ప్రాజెక్టులను పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవర్ స్టార్ 'వినోదయ సీతమ్' రీమేక్ మూవీని కూడా మొదలు పెట్టేశాడు. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తోన్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.
తమిళంలో సముద్రఖని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'వినోదయ సీతమ్' మూవీ.. ZEE5 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడిదే సినిమాను పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. దీనిని కూడా సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి చాలా వరకూ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అలాగే, వీలైనంత త్వరగానే దీన్ని పూర్తి చేసి ఆగస్టులోనే విడుదల చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది.

పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'వినోదయ సీతమ్' రీమేక్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి ఏదైనా కావాలని కోరుకుంటోన్నారు. ఈ క్రమంలోనే ఉగాది సందర్భంగా మార్చి 22వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారని తెలిసింది. అంతేకాదు, ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లు ఇద్దరూ దర్శనమివ్వబోతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. దీనికి 'దేవర' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తోన్నారు. అలాగే, శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్‌ను చేస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. ఇందులో పవన్ దేవుడి పాత్రను చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











