పవన్ ఉగ్రరూపం: శివాజీ రాజా రాజీనామా? చాంబర్లో తిష్ట... అందరి లెక్కలు తేలాల్సిందే!

By Bojja Kumar

Recommended Video

ఫిలిం ఛాంబర్ లో పవన్ తో మెగా ఫ్యామిలీ తో భేటీ

శ్రీరెడ్డి ఇష్యూ, కాస్టింగ్ కౌచ్, తన తల్లిని తిట్టించడానికి జరిగిన కుట్ర తదితర పరిణామాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం దాల్చారు. టీఆర్పీల కోసం మీడియా ప్రవర్తిస్తున్న తీరుతో విసిగిపోయిన ఆయన వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను అంటూ ఆగ్రహంగా ఫిలిం ఛాంబర్ వైపు కదిలారు.

అంతకు ముందు ఆయన ట్విట్టర్లో నేను నటుడి కంటే ముందు, రాజకీయ నేత కంటే ముందు ఓ అమ్మకు బిడ్డను. ఓ కొడుకుగా నా తల్లి గౌరవాన్ని కాపాడుకోలేకపోతే బతకడం కంటే చావడం మంచిది అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.

‘మా' అధ్యక్ష పదవికి శివాజీ రాజా రాజీనామా?

‘మా' అధ్యక్ష పదవికి శివాజీ రాజా రాజీనామా?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘మా' సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి ఇష్యూను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందే పరిష్కరించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు అనే వాదన వినిపిస్తోంది. దీనికి బాధ్యత వహిస్తూ ‘మా' అధ్యక్షుడు శివాజీ రాజా తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 ఫిలిం చాంబర్లో తిష్టవేసిన పవన్ కళ్యాణ్

ఫిలిం చాంబర్లో తిష్టవేసిన పవన్ కళ్యాణ్

కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలను, వివాదాలను ఒక కొలిక్కి తేవాలని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఫిలిం చాంబర్లో తిష్టవేసిన ఆయన ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు.

అందరి లెక్కలు తేలాల్సిందే

అందరి లెక్కలు తేలాల్సిందే

ఇండస్ట్రీలో తప్పుడు పనులు చేస్తున్న అందరి లెక్కలు తేల్చడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సీనీ ప్రముఖులంతా సమావేశానికి రావాలంటూ కోరినట్లు తెలుస్తోంది.

న్యాయవాదులతో పవన్ కళ్యాణ్ చర్చలు

న్యాయవాదులతో పవన్ కళ్యాణ్ చర్చలు

ఇండస్ట్రీలో నెలకొన్న వివాదం, క్యాష్ కమిటీకి సంబంధించిన అంశంపై పవన్ కళ్యాణ్ న్యాయ వాదులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పలువురు న్యాయవాదులు కూడా ఫిలిం చాంబర్‌కు చేరుకున్నారు.

ఇండస్ట్రీపై ఇంత జరుగుతున్న మౌనం ఎందుకని ఆగ్రహం

ఇండస్ట్రీపై ఇంత జరుగుతున్న మౌనం ఎందుకని ఆగ్రహం

ఇండస్ట్రీపై ఇంత జరుగుతున్న మౌనం ఎందుకని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ పరువు తీసే విధంగా మీడియాలో ఇంత రాద్దాంతం జరుగుతున్న పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు? తప్పు చేసిన వారి పట్ల ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నారు అని ఈ సమావేశంలో నిలదీయనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X