అల.. వైకుంఠపురములో: మెగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. పవన్ కళ్యాణ్ మార్క్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్ వర్క్స్‌పై స్పెషల్ కేర్ తీసుకోనున్నారు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలో బన్నీకి బాగా ప్లస్ అయ్యేలా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మార్క్ చూపించాలని ప్లాన్ చేస్తున్నారట మాటల మాంత్రికుడు. ఇదే జరిగితే మెగా ఫాన్స్‌కి ఇంతకన్నా మించిన పండగ ఇంకేముంటుంది అనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటా ప్లాన్? వివరాల్లోకి పోతే..

Recommended Video

#CineBox : Ileana D'Cruz Missed Out 2 Golden Chances With Salman Khan In These Two Films !
పవన్ కళ్యాణ్ పవన్ సాయం కోరిన త్రివిక్రమ్

పవన్ కళ్యాణ్ పవన్ సాయం కోరిన త్రివిక్రమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ బేసికల్‌గా మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ కలిసి ''జల్సా, అత్తారింటికి దారేది'' సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో ఈ స్నేహం మరింత బలపడింది. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కారణ్మగానే త్రివిక్రమ్ తన తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' కోసం పవన్ సాయం కోరారని తెలుస్తోంది.

'అల.. వైకుంఠపురములో' పవన్ మార్క్

'అల.. వైకుంఠపురములో' పవన్ మార్క్

ఇప్పటికే 'అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి విడుదలైన ''సామజవరాగమన, రాములో రాములా'' పాటలు రికార్డుల సునామీ సృష్టిస్తూ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రేజ్ రెట్టింపు చేసేలా పవన్ కళ్యాణ్ మార్క్ చూపించాలని భావిస్తున్న త్రివిక్రమ్.. పవన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు పవన్ అంగీకారం కూడా తీసుకొని ఆ పనులు మొదలుపెట్టారని టాక్.

త్రివిక్రమ్ కోసం పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్ కోసం పవన్ కళ్యాణ్

ఇప్పటికే తన అన్న మెగాస్టార్ చిరంజీవి కోసం 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పిన పవన్ కళ్యాణ్.. మరోసారి తన బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ కోసం 'అల.. వైకుంఠపురములో' సినిమాకు హెల్ప్ చేయబోతున్నాడన్న మాట. ఏదేమైనా ఇదే నిజమైతే మెగా అభిమానులకు ఇంతకన్నా మించిన పండగ మరోటి లేదనే చెప్పుకోవచ్చు.

 సంక్రాంతి కానుక.. అభిమానుల్లో ఆతృత

సంక్రాంతి కానుక.. అభిమానుల్లో ఆతృత

సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు 'అల.. వైకుంఠపురములో' టీజర్ డిసెంబర్ 7 లేదా 8వ తేదీన విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట త్రివిక్రమ్. అంటే పవన్ వాయిస్ వినడానికి సమయం చాలా దగ్గరపడిందన్నమాట.

'అల.. వైకుంఠపురములో' మూవీ

'అల.. వైకుంఠపురములో' మూవీ

గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందుతోన్న 'అల.. వైకుంఠపురములో' మూవీలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X