టాలీవుడ్‌లో బిగ్ సెన్సేషన్: పుష్ప 2లో పవన్ కల్యాణ్.. అల్లు అర్జున్ రేంజ్ పెంచేలా!
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి ఇప్పుడు వరల్డ్ రేంజ్‌కు చేరిపోయింది. దీంతో మన ఫిల్మ్ మేకర్లు, హీరోలు మరింత ఉత్సాహంగా భారీ సినిమాలను చేస్తున్నారు. అలా ఇప్పుడు చాలా చిత్రాలే రూపొందుతోన్నాయి. వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప ది రూల్' ఒకటి.
గతంలో వచ్చి సెన్సేషన్ అయిన 'పుష్ప ది రైజ్'కు సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని డబుల్ చేయడానికి దీని నుంచి పవర్‌ఫుల్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

పుష్ప ది రూల్ వస్తుంది
అల్లు అర్జున్ - సుకుమార్ కలిసి చేస్తున్న క్రేజీ పాన్ ఇండియా సీక్వెల్ మూవీనే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. జగదీష్, సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు.

శరవేగంగానే షూటింగ్
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 'పుష్ప ది రూల్' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇలా చాలా రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో చాలా టాకీ పార్టును కంప్లీట్ చేశారు.
రిలీజ్‌కు ముందే హైప్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న 'పుష్ప ది రూల్' సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో షూటింగ్‌ను శరవేగంగా జరుపుతూనే ప్రచార చిత్రాలను కూడా వదులుతున్నారు. ఇలా ఇటీవలే టీజర్‌ను రిలీజ్ చేశారు. దీనికి భారీ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై హైప్ భారీ స్థాయిలో పెరిగిపోయిందనే చెప్పుకోవాలి.

ప్రమోషన్ కోసం స్టార్లు
హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' మూవీలో ఎంతో మంది స్టార్లు నటిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సొంతం చేసుకున్న చాలా మంది నటీనటులను ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. వాళ్ల వల్ల సినిమా మరింత ప్రమోట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే, సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగానే దీనికి విభిన్నమైన ప్రచారం చేయనున్నారు.

పుష్ప 2లో పవర్ స్టార్
స్టార్ కాంబోలో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' మూవీకి సంబంధించి తరచూ ఏదో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా భాగం కాబోతున్నాడట. అంటే అతడు ఇందులో నటించడం లేదు.. కేవలం ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు తెలిసింది.

ఏం చెప్పబోతున్నాడు
'పుష్ప ది రైజ్' మూవీకి జగదీష్ వాయిస్ ఇచ్చాడు. కానీ, రెండో భాగాన్ని హై రేంజ్‌లో ప్లాన్ చేయడంతో ఓ స్టార్ గొంతు వినిపించాలని భావించారట. ఇందులో భాగంగానే మొదటి పార్టు కథను చెప్పడానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాయం అడిగినట్లు తెలిసింది. దీనికి ఆయన వెంటనే ఓకే చెప్పారట. ఎన్నికలు అయిన వెంటనే పవర్ స్టార్ ఈ పని పూర్తి చేయబోతున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











