Guntur karam: మహేశ్ మూవీలో పవన్ కల్యాణ్.. సెట్ చేసిన గురూజీ.. టాలీవుడ్‌లో మరో సెన్సేషన్
తెలుగు సినీ ఇండస్ట్రీ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండడంతో.. ఇప్పుడు మన హీరోలు భారీ స్థాయి చిత్రాలను చేస్తున్నారు. ఇలా ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌లలో ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు రూపొందుతోన్నాయి. అలాంటి వాటిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'గుంటూరు కారం' ఒకటి.
'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కలిసి చేస్తున్న 'గుంటూరు కారం' మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంతో రూపొందుతోంది.

మహేశ్ బాబు హీరోగా రూపొందుతోన్న 'గుంటూరు కారం' సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు, కొందరు స్టార్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పాటు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన కారణంగా షూటింగ్ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ చిత్రం ఆగిపోతుందా అన్న సందేహాలు కూడా వెల్లువెత్తాయి.
చాలా బ్రేకుల తర్వాత 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ గత వారంలోనే మళ్లీ మొదలైంది. ఇందులో ఓ ఆఫీస్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీన్లను షూట్ చేశారు. అలాగే, ఇప్పడు యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఈరోజు నుంచి మహేశ్ బాబుపై ఓ సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి తీసుకు రాబోతున్నారు.

స్టార్ కాంబోలో రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి తరచూ ఏదో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా భాగం కాబోతున్నాడట. అంటే అతడు ఇందులో నటించడం లేదు.. కేవలం ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం.. గుంటూరు మిర్చి యార్డు నేపథ్యంతో రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీ ఆరంభంలో ప్రేక్షకులను కథలోకి తీసుకు వెళ్లే విధంగా పవన్ తన గొంతును వినిపించబోతున్నాడట. త్రివిక్రమ్ కోరిక మేరకు అతడు దీనికి ఒప్పుకున్నాడని తెలిసింది. సినిమా షూట్ పూర్తైన తర్వాతనే పవన్ కల్యాణ్‌తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తారనే టాక్ వినిపిస్తోంది. గతంలో 'జల్సా' సినిమాకు మహేశ్ బాబు వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవబోతుంది.


Click it and Unblock the Notifications











