పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కబురు, ఎన్నికల లోపు.. నిర్మాతగా మరో సినిమా, హీరో ఎవరంటే!

Recommended Video

Pawan Kalyan Plans For A Movie Before Elections

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు. పవన్ కళ్యాణ్ మరో సినిమాలో నటిచాలని కోరుకునే వారికి ఇది గుడ్ న్యూసే. ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో పవన్ ఈ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పవన్ గురించి మరో ఆసక్తికరమైన వార్త కూడా ప్రచారం జరుగుతోంది. నిర్మాతగా కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో పవన్ ఉన్నారట.

చివరగా అజ్ఞాతవాసి

చివరగా అజ్ఞాతవాసి

పవన్ కళ్యాణ్ చివరగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం అభిమానులని నిరాశ పరిచింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా మారిపోయాడు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ పర్యటనలు కొనసాగుతున్నాయి.

కొత్త సినిమా కబురు

కొత్త సినిమా కబురు

పవన్ సన్నిహిత వర్గాల నుంచి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ లోపు మరో చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై పవన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారట. సన్నిహితులతో, పార్టీ నేతలతో కూడా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఎన్నికలకు ముందు

ఎన్నికలకు ముందు

ఎన్నికలకు ముందు ఓ చిత్రం విడుదుల చేస్తే ప్రచారానికి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు నెలలో పవన్ దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నిర్మాతగా కూడా

నిర్మాతగా కూడా

మరో ఆసక్తికర విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ నిర్మాతగా కూడా ఓ సినిమాని చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే నితిన్ తో పవన్ ఛల్ మోహన్ రంగ చిత్రాన్ని నిర్మించాడు.

హీరో ఎవరంటే

హీరో ఎవరంటే

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్నాడు. తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. వైష్ణవ్ లాంచ్ మూవీని పవన్ నిర్మించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కనుక జరిగితే వైష్ణవ్ తొలి చిత్రానికి మంచి స్టేజి దొరికినట్లే. ఈ చిత్రానికి కాటమరాయుడు డైరెక్టర్ డాలి పేరు వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X