ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నాడా?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో 'గోపాలా గోపాలా' టైటిల్‌తో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ ఓ పాట ఈ చిత్రంలో పెట్టాలని పట్టుబడుతున్నాడట.
పవన్ కళ్యాణ్ గతంలో నటించిన 'గోకుళంలో సీత' చిత్రంలోని 'గోకుల కృష్ణా గోపాలా కృష్ణా మాయలు చాలయ్యా...' సాంగును 'గోపాలా గోపాలా' చిత్రంలో ఎక్కడో ఒక చోట పెట్టాలని దర్శకుడికి సూచించాడట. అప్పట్లో ఈ పాట మంచి హిట్టయిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో వెంకీ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకుడు. హిందీలో విజయవంతమైన 'ఓ మైగాడ్'కిది రీమేక్. అందులో పరేష్ రావల్ పోషించిన పాత్రను ఇక్కడ వెంకటేష్, అక్షయ్ కుమార్ చేసిన కృష్ణుడు పాత్రను పవన్ కల్యాణ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని...కృష్ణాష్టమి (ఆగస్టు 16) రోజు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
సురేష్ ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి.


Click it and Unblock the Notifications











