పవన్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాకే..
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా కలెక్షన్స్ గురించి నిర్మాతలు ఎక్కడా ప్రస్దావించలేదని సంగతి తెలిసిందే. దూకుడు,ఊసరవెల్లి తరహాలో ఈ చిత్రం కలెక్షన్స్ ను కూడా ప్రకటిస్తే బాగుండునని పవన్ ఫ్యాన్స్ చాలా ఎదురుచూసారు. అయితే ఎక్కడా వారు ఈ కలెక్షన్స్ వ్యూహంలోకి చొరబడలేదు. అయితే దీనకి కారణం పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ గా కలెక్షన్స్ విషయంలో వార్నింగ్ ఇవ్వటమేనని తెలుస్తోంది. తనకి దూకుడు,మగధీర మధ్య జరుగుతున్న కలెక్షన్స్ వార్ లో చొరబడటం ఇష్టం లేదని చెప్పి కలెక్షన్స్ డిస్కషన్స్ కు పుల్ స్టాప్ పెట్టారు. ఇక పంజా టైటిల్ సాంగ్ ని ఛేంజ్ చేసిన తర్వాత కాస్త కలెక్షన్స్ పుంజుకున్నాయని వినపడుతోంది. ఇక కలెక్షన్స్ గురించి తాజాగా నిర్మాతలు చెప్తూ.. పంజాని డిస్ట్రిబ్యూటర్స్ అంతా సేఫ్ అని, రెండవ వారం నుంచి వారు లాభాల్లో పడతారని అన్నారు.
సినిమా టాక్ బాగోకపోయినా అద్బతమైన ఓపినింగ్స్ వచ్చాయన్నారు. నిర్మాత నీలిమ మాట్లాడుతూ.. తన లక్ష్యం పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యటేమేనని, అలాగే పవన్ ని స్టైలిష్ గా, కంట్రోల్డ్ ఫెరఫార్మెన్స్ తో చూపాలని, అది తాము సాధించామని చెప్పారు. ట్రేడ్ పండితులు మాత్రం ఇప్పటి వరకూ పంజా మంచి బిజినెస్సే చేసిందని, పవన్ కళ్యాణ్ గత చిత్రం తీన్ మార్ తో పోలిస్తే ఓపెనింగ్ కలెక్షన్స్ తో పంజా బాగా రాబడుతోందని అంటున్నారు. అదేవిధంగా రీసెంట్ విడుదలైన మహేష్ బాబు చిత్రం దూకుడు, జూ ఎన్టీఆర్ చిత్రం ఊసరవెల్లితో పోల్చుతూ ఈ రెండు చిత్రాలకంటే ఎక్కువగా గానే పంజా ఓపెనింగ్స్ రాబట్టిందిని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











