Bheemla Nayak చూసిన పవన్ కల్యాణ్: మూవీ కంప్లీట్ కాగానే ఏం చేశాడో తెలిస్తే!
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగులో సరికొత్త నేపథ్యాలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో చాలా సినిమాలు మల్టీస్టారర్‌గానే రూపొందుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించాయి. అలాంటి సినిమాల్లో భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న 'భీమ్లా నాయక్' ఒకటని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం ఇది టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలయికలో వస్తుండడమే.
ఈ ఫిల్మ్‌పై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

క్రేజీ కాంబినేషన్‌లో భీమ్లా నాయక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్ దీనికి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.

దానికి రీమేక్‌గా.. ఇద్దరి రోల్స్ ఇలా
భీమ్లా నాయక్ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో ఇది రూపొందింది. ఇందులో పోలీస్ పాత్రలో పవన్.. లోకల్ డాన్‌గా దగ్గుబాటి రానా కనిపించనున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా రివీల్ చేశారు.

ఆ వీడియోలతో భారీ అంచనాలు
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్ ఆ మధ్య వచ్చింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా వచ్చింది. ఇవి అభిమానులతో పాటు సినీ ప్రియులందరి ఆదరణను అందుకున్నాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రిలీజ్‌కు ముందే ఇది ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకుంది.

రిలీజ్ వాయిదా.. ఆ రెండు డేట్లతో
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని భావించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించడంతో అయోమయం నెలకొంది.

జెట్ స్పీడుతో పూర్తైన మూవీ వర్క్స్
‘భీమ్లా నాయక్' మూవీ వాయిదా పడడంతో బ్యాలెన్స్ ఉన్న షూటింగ్‌ను కూడా నిలిపేసి, కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులను మాత్రం జెట్ స్పీడుతో సాగించారు. ఆ తర్వాత షూటింగ్‌ను పున: ప్రారంభించి టాకీ పార్ట్ పూర్తి చేశారని అంటున్నారు. అంతేకాదు, దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎంతో వేగంగా పూర్తయ్యాయని తెలిసింది.

ఫస్ట్ కాపీ చూసేసిన పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా హీరోలుగా టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ‘భీమ్లా నాయక్' మూవీకి సంబంధించిన ఫస్ట్ కాపీ తాజాగా పూర్తైందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, దీనిని పవన్ కల్యాణ్, సాగర్ కే చంద్ర, త్రివిక్రమ్ శ్రీనివాస్, సూర్యదేవర నాగ వంశీతో పాటు చిత్ర యూనిట్ మొత్తం ప్రసాద్ ల్యాబ్స్‌లో వీక్షించిందని కూడా అంటున్నారు.
Recommended Video

సినిమా చూసిన తర్వాత సంతోషం
‘భీమ్లా నాయక్' మూవీని చూసిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ సినిమా చూసిన వెంటనే దర్శకుడు సాగర్‌తో పాటు త్రివిక్రమ్, నాగ వంశీని హగ్ చేసుకున్నాడట ఈ స్టార్ హీరో. మొత్తానికి ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ ఖుషీ అవుతుందట.


Click it and Unblock the Notifications










