మూడో పెళ్లి గుట్టు విప్పనున్న పవన్ కళ్యాణ్?

By Bojja Kumar

Pawan Kalyan will speak about his 3rd marriage
హైదరాబాద్: అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు అప్పట్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికే ఆయన రేణుదేశాయ్‌తో సహజీవనం చేస్తూ పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడం అనే అంశాన్ని లేవనెత్తి ఇతర పక్షాల రాజకీయ పార్టీలు విమర్శలు సంధించాయి. ఆ విమర్శల కారణంగానే ఆయన రేణుదేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్న సందర్భంలోనూ ఆయనకు ఇలాంటి తలనొప్పే ఎదురు కాబోతోంది. ఇటీవల ఆయన ఓ విదేశీ అమ్మాయిని మూడో పెళ్లి చేసుకున్నట్లు మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాను రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా ఈ నెల 14న ఏర్పాటు చేయబోయే సమావేశంలో పవన్ కళ్యాణ్ తన మూడో పెళ్లి విషయం గురించి కూడా స్పష్టమైన వివరణ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

తన రాజకీయ తెరంగ్రేటం గురించి ప్రెస్ మీట్ ఏర్పాటుకు ఒక రోజు ముందుగానే పవన్ తన అభిమానులో భేటీ కాబోతున్నారు. ఈ మేరకు పలువురు సీనియర్ అభిమానులకు పిలిచినట్లు తెలుస్తోంది . 13వ తేదీన జరిగే ఈ అభిమానుల సమావేశంలో పలు అంశాలను చర్చించబోతున్నట్లు సమాచారం. అభిమానుల సూచనలను కూడా పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నాడని టాక్.

పవన్‌ కళ్యాణ్‌ పెట్టబోతున్న కొత్త పార్టీ పేరు 'జనసేన' అని సమాచారం. ఈమేరకు పవన్‌ కల్యాణ్‌ సోమవారం ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈనెల 14న పార్టీ గుర్తు, జెండా, విధి విధానాలను ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. 14వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో పవన్‌ చేసే ప్రసంగాన్ని ప్రత్యేక స్కీన్‌ల ద్వారా ప్రజలకు వినిపిం'చడానికి వారు రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలలో ఏర్పాట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X