ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: గబ్బర్ సింగ్ కాంబినేషన్ పవన్ రీఎంట్రీ.. హరీష్ కామెంట్ వెనుక మర్మం..

By Manoj

పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఆయనకు అభిమానులు భారీగా ఉన్నారు. అయితే, రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చారు. దీంతో ఆయన అభిమానుల్లో నిరాశ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

పవన్ రీఎంట్రీపై ఎన్నో వార్తలు

పవన్ రీఎంట్రీపై ఎన్నో వార్తలు

పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడితో మూవీ సెట్ అయిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఇలా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఏ సినిమా సెట్ కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఆ సినిమా రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్

ఆ సినిమా రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్

అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రలో నటించిన ‘పింక్'. బాలీవుడ్‌లో వచ్చిన సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు హక్కులను తీసుకున్న దిల్ రాజు.. ఇటీవలే పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు జరిపారని, ఈ సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సినిమాకు శ్రీదేవి భర్త బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

పవన్ రెమ్యూనరేషన్ కూడా..

పవన్ రెమ్యూనరేషన్ కూడా..

‘పింక్' రీమేక్‌కు సంబంధించి ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే... ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ రూ. 40 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. అంతేకాదు, లాభాల్లో 25 శాతం వాటా కూడా ఇవ్వాలని అంటున్నాడట. పవన్ చేస్తున్న డిమాండ్స్‌కు సినీ పెద్దలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని టాక్. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో సినిమా

హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో సినిమా

పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. ఈ సారి మరో డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆ పేరు ఎవరిదనే కదా మీ సందేహం..? ఆయన మరెవరో కాదు.. పవన్‌కు భారీ విజయాన్ని అందించిన హరీశ్ శంకర్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అలాగే, తాజాగా ఆయన ‘గద్దలకొండ గణేష్'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

చర్చలు కూడా ముగిశాయట

చర్చలు కూడా ముగిశాయట

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో చేసిన ‘గద్దలకొండ గణేష్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత హరీశ్.. పవన్‌కు ఓ కథను చెప్పాడట. ఇది ఆయనకు బాగా నచ్చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. అయితే, ఈ సినిమాను తనకు వీలైనప్పుడు మాత్రమే చేస్తానని కండీషన్ పెట్టారట పవన్ కల్యాణ్. అయితే, దీనికి నిర్మాణం ఎవరు వహిస్తారన్నది మాత్రం తెలియ రాలేదు.

క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్

క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్

గతంలో హరీశ్ శంకర్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో సినిమా ఓకే అయిందని వార్తలు వైరల్ అయిపోయాయి. ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ అందరూ ఎంతో సంబరపడిపోయారు. అప్పుడు దీనిపై హరీశ్ స్పందించాడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పాడు. అయితే, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌కు స్క్రిప్ట్ వినిపించలేదని, అసలు పవన్‌ను కలవలేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి.

Recommended Video

#CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
గబ్బర్ సింగ్ గురించి..

గబ్బర్ సింగ్ గురించి..

గబ్బర్ సింగ్.. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు వచ్చిన హిట్ సినిమా ఇది. సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్'కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించగా, స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా మాంచి టాక్ సంపాదించుకోవడంతో పాటు కలెక్షన్లను భారీగానే రాబట్టుకోగలిగింది. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డులకెక్కింది. అలాగే, ఈ సినిమాలో పవన్ చెప్పిన పంచ్ డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X