పవన్ కళ్యాణ్ నెక్ట్స్ చిత్రం ఆ డైరక్టర్ తో..!?
పవన్ కళ్యాణ్ చేస్తున్న 'కొమురం పులి' చిత్రం రిలీజుకు ముస్తాబవుతున్న సందర్భంలో ఆయన తర్వాత ఏ చిత్రం చేయబోతారనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. అందుకు తగ్గట్లే హరీష్ శంకర్, పూరీ జగన్నాధ్, విజయ్ భాస్కర్ వంటి పేర్లు వినిపించాయి. కానీ హఠాత్తుగా చిరంజీవితో 'బావగారు బావున్నారా', 'శంకర్ దాదా ఎంబిబియస్' చిత్రాలు రూపొందించిన దర్శకుడు జయంత్ సి. పరాన్జీ సీన్ లోకి వచ్చారు. ఆయన ఇప్పటికే పవన్ కి ఓ కథ వినిపించారని, అది ఓకే అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
రవితేజ, నయనతారల కాంబినేషన్ లో ఆంజనేయులు చిత్రాన్ని నిర్మించిన హాస్య నటుడు గణేష్ ఈ చిత్రం చేయనున్నారని చెప్తున్నారు. ఇక జయంత్ ప్రస్తుతం అంతా కొత్త వారితో లవ్ ఫర్ ఎవర్ అనే చిత్రం రూపొందిస్తున్నారు. అలాగే పవన్ తో చేయబోయే చిత్రం ఫన్ తో కలిసిన లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని చెప్తున్నారు. ఇక జయింత్ సైతం తన రీఎంట్రీకి పవన్ వంటి స్టార్ అయితేనే సరిపోతాడని భావిస్తున్నారు. అంటే త్వరలో ఓ 'ప్రేమించుకుందాం రా','ప్రేమంటే ఇదేరా' వంటి ప్రేమ కథతో వస్తారేమో చూద్దాం.


Click it and Unblock the Notifications











