పవన్ చిత్రానికి 'కొలావెరిడి' మ్యూజిక్ డైరక్టర్
పవన్ కళ్యాణ్ చిత్రం అంటే ప్రతీ విభాగంలోనూ ఏదో ఒక స్పెషాలిటి ఉండాల్సిందే. తాజాగా కొలావరి డి పాటతో సంచలనం రేపిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ని తన సినిమాకు తీసుకోవటానికి సమ్మతించినట్లు తెలుస్తోంది. ధనుష్ చిత్రం త్రి లో కోసం అతను చేసిన కొలావరి డి పాట ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ కుర్రాడిని త్రి హీరోయిన్ మరియు,గబ్బర్ సింగ్ హీరోయిన్ అయిన శృతి హాసన్ తీసుకు వచ్చి పవన్ కి పరిచయం చేసిందని తెలుస్తోంది.
పవన్ ఆ యువతరంగాన్ని మెచ్చుకుని తన తదుపరి చిత్రంలో మ్యూజిక్ డైరక్టర్ గా ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పుతున్నారు. ఇక అతను కొత్తగా చేసిన ఓ మూడు ట్యూన్స్ కూడా విని మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేసే పవన్ తనను తీసుకోవటానికి ఆసక్తి చూపటంతో ఆ యువ సంగీత దర్శకుడు ఆనందానికి హద్దే లేదుట. అయితే ఏ చిత్రానికి ఆ కుర్రాడిని తన సినిమాకు పవన్ తీసుకుంటాడనేది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం పవన్ గబ్బర్ సింగ్ ఫినిషింగ్ లో ఉన్నారు. మరో ప్రక్క పూరీ జగన్నాధ్ చిత్రానికి రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











