క్రియేటివ్ దర్శకుడుతో పవన్ నెక్ట్స్?
ప్రస్తుతం కృష్ణ వంశీ తన తాజా చిత్రం పైసాపై దృష్టి పెట్టారు. నాని హీరోగా రూపొందిన ఆ చిత్రం డబ్బు ..మానవ సంభంధాలు అనే అంశం చుట్టూ తిరుగుతుంది. ఇక పవన్ కల్యాణ్, సమంత జంటగా నటిస్తున్న క్రేజీ చిత్రం 'అత్తారింటికి దారేది' . త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రణీత మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ చిత్రం డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.త్వరలో 25 రోజుల షెడ్యూల్ నిమిత్తం యూరప్ వెళ్లేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా స్పెయిన్‌లోనూ చిత్రీకరణ జరపనున్నారు.
'వన్ లైనర్' డైలాగులకూ, కామెడీకీ పెట్టింది పేరైన త్రివిక్రమ్ ఈ సినిమాలోనూ వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, ఇటీవలే 'మిర్చి'లో ప్రభాస్ తల్లిగా కనిపించిన నదియా కీలక పాత్రలు చేస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. 'జల్సా' వంటి హిట్ సినిమా తర్వాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సినిమాపై అంచనాలు అసాధారణంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications












