Business: పవన్ కల్యాణ్ మూవీకి రికార్డు బిజినెస్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లంటే?
ఈ ఏడాదిలో టాలీవుడ్ సినిమా నుంచి పెద్ద హీరోల వరకు సినిమాలు అంతగా ఏమీ కనిపించలేదు. జనవరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా తప్ప ఇప్పుడు వరకు మన స్టార్స్ నుంచి సినిమాలు పడలేదు. దాదాపు మిగతా బిగ్ స్టార్స్ అంతా తమ సినిమాల్లో షూటింగ్లోనే బిజీగా ఉన్నారు.
ఇక రానున్న రోజుల్లో మాత్రమే మన స్టార్స్ సినిమాలు ఏడాదిలో రిలీజ్ కి రాబోతున్నాయి. అయితే ఈ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు ముందు వరుసలో ఉంది. నిజానికి ఈ చిత్రం గత మార్చిలోనే రిలీజ్ రావాల్సి ఉంది అది కాస్త మే నెలలో వాయిదా పడింది.

ఈ సినిమా వాయిదా పడడం ఇది మొదటి సారి మాత్రం కాదు ఇది వరకే అనేకసార్లు ఈ సినిమా వాయిదా పడి ఇప్పుడు మళ్ళీ కొత్త తేదీని వెతుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది. నిజానికి ఈ చిత్రం మొదలైంది అప్పటినుంచి ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుంటున్నది.
మధ్యలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా కాకుండా రెండు సినిమాలు చేసేసి ఒకటి విడుదల చేయడం జరిగింది. ఇంకొకటి విడుదలకు సిద్ధంగా కూడా ఉంది అయినప్పటికీ ఈ హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఇంకా విడుదలకి నోచుకోలేదు. అలాగే ఈ సినిమా పవన్ నుంచి అనౌన్స్ అయిన సమయంలో ఉన్న అంచనాలు అప్పట్లో తారాస్థాయిలో ఉండేవి.
సినిమా అలా ఆలస్యం అవుతూ నెలల నుంచి సంవత్సరాలు దాటిపోవడంతో పవన్ అభిమానుల్లోనే అంచనాలు సన్నగిల్లాయి. దీనికి తోడు మధ్యలో దర్శకుడు సుజిత్ తో అనౌన్స్ చేసిన ఓజీ సినిమా ఈ సినిమా హైప్ ని ఓవర్ టేక్ చేసి దానికి అంచనాలు పెంచుకుంది. ఇక టాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు మరీ అంతగా ప్రస్తుతానికి లేవు.
అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు చేస్తున్న థియేటర్ బిజినెస్ లెక్కలు ఉంటే మతిపోయేలా ఉన్నాయని చెప్పాలి. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా ఏకంగా 135 కోట్లకు పైగా బిజినెస్ ని చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో నైజాంలోనే 45 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందట. ఇక మిగతా 90 నుంచి 100 కోట్ల బిజినెస్ ఆంధ్రలో జరిగినట్టు తెలుస్తుంది.
ఇది మాత్రం నిజమైతే ఒకింత బయ్యర్లకి రిస్క్ అని చెప్పక తప్పదు. పవన్ అభిమానులు చూసినా సరే ఓపెనింగ్స్ దక్కుతాయి తప్పితే మిగతా జనంలో ఈ సినిమా పట్ల అంతగా అంచనాలు అయితే లేవు సో కచ్చితంగా ఈ సినిమా గట్టిగా రాణించాల్సి ఉంటుంది. బజ్ లేని ఈ సినిమా ఏ మేరకు ఈ 135 కోట్లు టార్గెట్ ని తెలుగు రాష్ట్రాలలో రీచ్ అవుతుందా వేచి చూడక తప్పదు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటులు బాబి డియోల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తుండగా ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ తో కృషి సినిమా చేసిన నిర్మాత నం ఏ ఎం రత్నం ఈ సినిమాపై కోట్లాది రూపాయలు బడ్జెట్ ని వెచ్చించారు.


Click it and Unblock the Notifications











