Balayya: బాలయ్యకే నో చెప్పిన పవన్ కల్యాణ్ హీరోయిన్.. ఆమెకు అంత డేర్ ఎలా వచ్చిందబ్బా?
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు నందమూరి అభిమానులకు మాత్రమే కాదు ఇతర హీరోల ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. ప్రస్తుతం ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో హ్యాట్రిక్స్ హిట్స్ అందుకుని కెరీర్లో పీక్ స్టేజీలో ఉన్నారు. ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు.
అయితే పుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య సినిమాలో నటించేందుకు పవన్ కల్యాణ్ హీరోయిన్ నో చెప్పిందట. ప్రస్తుతం ఆ విషయం బయట తెగ చక్కర్లు కొడుతోంది. బాలయ్యకే నో చెప్పిన ఆ భామ ఎవరబ్బా అని ఆసక్తి చూపుతున్నారు కొంతమంది నెటిజన్లు. అయినా ఆమెకు బాలయ్యకే నో చెప్పే డేర్ ఉందా? అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. దాని గురించే ఈ కథనం..

ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన హోమ్లీ బ్యూటీగా రాణించిన మలయాళ సోయగం మీరా జాస్మిన్. తెరపై తన అందం, అమాయకత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు సినీ ప్రియులంతా ఆమె నటనకు, అందానికి ఫిదా అయిపోయారు. రవితేజ, పవన్ కళ్యాణ్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. భద్ర, మహరధి, గోరింటాకు, గుడుంబా శంకర్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
ఇతర భాషా చిత్రాల్లోనూ స్టార్ హీరోయిన్గా రాణించింది. ఆ తర్వాత కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సినిమాలకు దూరమై షాక్ ఇచ్చింది. అలా చాలా కాలం తెలుగు ఇండస్ట్రీకి దూరమైన ఈ భామ కొంత కాలం నుంచి సెకండ్ ఇన్నింగ్స్‌లో రీఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడాయాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ హాట్ అందాలతో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. కుర్ర హీరోయిన్లతో పోటీగా గ్లామర్ ఫోటోలతో అందాలను ఆరబోస్తోంది.

అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సమయంలోనే మీరా జాస్మిన్‌కు విక్టరీ వెంకటేశ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిందట. బ్లాక్ బస్టర్ నారప్ప సినిమాలో ముందుగా మీరా జాస్మిన్ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. మరోవైపు బాలయ్య సినిమాలో వచ్చిన అవకాశాన్ని కూడా రిజెక్ట్ చేసిందట. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీర సింహా రెడ్డిని రిజెక్ట్ చేసిందట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలీదు కానీ ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇకపోతే రీసెంట్గా మీరా జాస్మిన్ విమానం చిత్రంలో కీలక పాత్రను పోషించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. దీంతో పాటే నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న టెస్ట్ సినిమాకు మీరా జాస్మిన్ ఓకే చెప్పింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆమె ఎంతో అందంగా కనిపించింది.


Click it and Unblock the Notifications











