పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్ ‘లాయర్ సాబ్’ కాదు.. మరో దానిని ఫైనల్ చేసిన పవర్ స్టార్.!

By Manoj Kumar P

Recommended Video

Ala FilmNagarloo Episode 1 | PSPK 26 | #Prabhas21 | Crack | Megastar Chiranjeevi | RRR

తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గతంలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇక, ఇప్పట్లో ఆయన రీఎంట్రీ ఉండదని అనుకుంటున్న సమయంలో అందుకే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పలు చిత్రాలను ఫైనల్ చేశారు. అందులో 'పింక్' రీమేక్ ఒకటి. తాజాగా దీనికి ఫిక్స్ చేసిన టైటిల్ లీక్ అయింది. ఇంతకీ ఏంటా టైటిల్.?

ఫ్యాన్స్‌లో పెరిగిన నిరాశ.. నిర్ణయం మారింది

ఫ్యాన్స్‌లో పెరిగిన నిరాశ.. నిర్ణయం మారింది

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి' తర్వాత పవన్ కల్యాణ్ మరో సినిమాలో నటించలేదు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ మరోసారి తన ముఖానికి మేకప్ వేసుకోవాలనుకుని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఏమాత్రం హడావిడి లేకుండా ప్లాన్ చేశారు

ఏమాత్రం హడావిడి లేకుండా ప్లాన్ చేశారు

తన రీఎంట్రీ విషయంలో పవన్ కల్యాణ్ ఎటువంటి హంగులకు తావివ్వలేదు. ఈ క్రమంలోనే అందరికీ తెలిసిన కథతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పింక్' సినిమా రీమేక్‌లోనే ఆయన నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.

 పవన్ స్పందించలేదు.. పని మాత్రం చేస్తున్నాడు

పవన్ స్పందించలేదు.. పని మాత్రం చేస్తున్నాడు

కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ రీఎంట్రీ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అయినప్పటికీ ఈ విషయంపై ఆయన స్పందించలేదు. దీంతో కొంత మందిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఏకంగా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ప్రకటన అయితే చేయలేదు కానీ, ఆయన స్వయంగా షూటింగ్ చేయడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

 పవన్ సినిమాకు కొత్త భయం పట్టుకుందట

పవన్ సినిమాకు కొత్త భయం పట్టుకుందట

పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. వాస్తవానికి ఆయనకు సంబంధించిన స్క్రీన్ టెస్ట్ జరిగిన రోజే ఆ ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. అలాగే, ఈ మధ్య షూటింగ్ స్పాట్ నుంచి మరో వీడియో కూడా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టింది. దీంతో ఇకపై ఇంకెన్ని వీడియోలు, ఫొటోలు లీక్ అవుతాయో అని చిత్ర యూనిట్ భయపడిపోతోందట.

ఈ సినిమా టైటిల్ ‘లాయర్ సాబ్' కాదు

ఈ సినిమా టైటిల్ ‘లాయర్ సాబ్' కాదు

వేశ్యా గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు అమ్మాయిలను కాపాడే లాయర్‌గా ఇందులో పవన్ కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాకు ‘లాయర్ సాబ్' అనే టైటిల్ ఫిక్స్ అయిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమా టైటిల్ అది కాదని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. పవన్ కొత్త సినిమాకు ‘వకీల్ సాబ్' అనే టైటిల్ ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

పవన్ సహకారంతో ఫిక్స్ చేసేసిన చిత్ర యూనిట్

పవన్ సహకారంతో ఫిక్స్ చేసేసిన చిత్ర యూనిట్

ఈ సినిమాకు సంబంధించి అన్నీ ఫిక్స్ అయిపోయాయని తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో నటించే హీరోయిన్లుగా నివేదా థామస్, అంజలి, అనన్యను తీసుకున్న చిత్ర యూనిట్.. మిగిలిన నటీనటులను కూడా ఫైనల్ చేసేసింది. ఇక, ఉగాది కానుకగా మార్చి 25న ఈ సినిమా టైటిల్ లోగోను, మే 15న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X