పిఠాపురం ఇంటిని పవన్ కల్యాణ్ తనఖా .. పీకల్లోతు అప్పుల్లో నిర్మాత కోసం అలాంటి త్యాగం!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీబిజీగా మారినా పవన్ కళ్యాణ్.. విరామం దొరికినప్పుడల్లా వెండితెర కనిపించి తన సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అలాగే.. తన సినిమాలు హిట్ అయితే.. మూవీ మేకర్స్‌కు ఊహించిన విధంగా బహుమతులిచ్చి.. వారిని ప్రోత్సహించే విషయం తెలిసిందే. అంతేకాదు.. తన నిర్మాత, మూవీ మేకర్స్‌కు కష్టాలు వస్తే వారికి అండగా నిలుస్తారు. ఇటీవల పీకల్లోతు అప్పుల్లో తన మూవీ నిర్మాత కోసం అండగా నిలిచారంట. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చేశారు. అసలేం జరిగింది?
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయిక నటించగా.. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు మాత్రం బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. ప్రీమియర్లతో కలిపి తొలి రోజు సుమారు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అయితే నెగటివ్ టాక్ ప్రభావంతో రెండో రోజు నుంచే కలెక్షన్లు గణనీయంగా తగ్గాయి. ఫైనల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.110 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన లాభాలు అందుకోలేక భారీ నష్టాలతో ముగిసిందట.

టాలీవుడ్‌లో స్టార్ హీరోలు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఇలా దారుణంగా నష్టపోయిన మూవీ మేకర్స్ కు పవన్ కల్యాణ్ అండగా నిలిచారట. వారికి ఆర్థికంగా భరోసా ఇచ్చారట. సాధారణంగా పవన్ కల్యాణ్ ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది.
'హరిహర వీరమల్లు' సినిమా కోసం తొలుత ఆయనకు రూ.50 కోట్ల పారితోషికం ఖరారైనట్టు సమాచారం. అయితే సినిమా నిర్మాణ దశలో నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న పవన్, ఆ మొత్తం నుంచి కేవలం రూ.11 కోట్లకే పరిమితమయ్యారు. ఇదే కాదు, సినిమా విడుదలకు ముందు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారడంతో ఆ రూ.11 కోట్ల రెమ్యునరేషన్‌ను కూడా విడిచిపెట్టారంట.
అంతేకాదు, సినిమా ఫైనాన్సర్లకు నిర్మాతల తరఫున పవన్ కల్యాణ్ స్వయంగా గ్యారంటీగా నిలిచారు. ఈ బాధ్యతను తీసుకున్న తర్వాత, ఆ మొత్తాలను తిరిగి చెల్లించేందుకు పవన్ స్వయంగా ముందుకొచ్చారు. అందులో భాగంగా పిఠాపురంలో ఉన్న తన స్వంత ఇంటిని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీర్చినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది కేవలం ఒక నటుడిగా కాదు, ఒక బాధ్యతాయుత వ్యక్తిగా పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరుకు నిదర్శనమని అభిమానులు చెబుతున్నారు.
అంతే కాదు.. 'హరిహర వీరమల్లు' సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో భారీ నష్టాలు ఎదుర్కొన్న ఓ బయ్యర్‌కు పవన్ కల్యాణ్ స్వయంగా రూ.1.5 కోట్ల వరకు సహాయం చేసినట్టు సమాచారం. సినిమా వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ మొత్తం కూడా పవన్ జేబు నుంచే వెళ్లినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా లెక్కలు వేస్తే.. ఈ సినిమా ద్వారా పవన్ కల్యాణ్ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదనే మాట వినిపిస్తోంది.
రెమ్యునరేషన్ త్యాగం చేయడమే కాకుండా, ఫైనాన్సర్లకు చెల్లింపులు, బయ్యర్లకు ఇచ్చిన సహాయం కారణంగా ఆయనకు ఆర్థికంగా నష్టమే మిగిలిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక స్టార్ హీరో సినిమా చేస్తే లాభాలు గడించడం సాధారణంగా కనిపించే విషయం. కానీ 'హరిహర వీరమల్లు' విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు.
ఈ విషయంసోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, పవన్ అభిమానులు ఆయనను "రియల్ హీరో" అంటూ కొనియాడుతున్నారు. సినిమాను వ్యాపారంగా కాకుండా, బాధ్యతగా చూసిన వ్యక్తిగా పవన్ కల్యాణ్ మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారని అంటున్నారు. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ తన విలువలు, మాట నిలబెట్టుకునే వ్యక్తిగా పవన్ కల్యాణ్ పేరు మరోసారి వినిపిస్తోంది. ఏదిఏమైనా పవన్ కళ్యాణ్ మనసున్న మా రాజు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











