పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్: మొదటిది కాదు.. ‘వకీల్ సాబ్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.!

By Manoj Kumar P

తెలుగు తెరపై తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపును తెచ్చుకున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. చాలా కాలం పాటు సినిమాల్లో నటించి, ఎన్నో మరుపురాని చిత్రాలను అందించాడు ఈ మెగా హీరో. ఆ తర్వాత ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలోనే ఆర్థిక వనరుల కోసం తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నాడు. దీంతో పవన్ రీఎంట్రీ హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా అతడి కమ్‌బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' వాయిదా కన్ఫార్మ్ అయినట్లు తెలిసింది. అంతేకాదు, కొత్త రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఆ వివరాలు మీకోసం.!

ఆయన ప్రయత్నం.. పవన్ మనసు మార్చింది

ఆయన ప్రయత్నం.. పవన్ మనసు మార్చింది

రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా మంది ఫిల్మ్ మేకర్లు పవన్ కల్యాణ్‌తో సినిమా చేయించడానికి ప్రయత్నించారు. కానీ, ఆయన మాత్రం రీఎంట్రీకి ఒప్పుకోలేదు. పైగా ప్రజాసేవకే తన ప్రాధాన్యమని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే బడా నిర్మాత దిల్ రాజు చేసిన ప్రయత్నం ఫలించింది. దీంతో మనసు మార్చుకున్న పవన్ సినిమాలు చేయడానికి అంగీకరించాడు.

పొలిటీషియన్.. వకీల్ సాబ్‌గా మారిపోయాడు

పొలిటీషియన్.. వకీల్ సాబ్‌గా మారిపోయాడు

బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన ‘పింక్' మూవీ రీమేక్‌తోనే పవర్ స్టార్ రీఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో ఈ సినిమా ‘వకీల్ సాబ్' అనే టైటిల్‌తో వస్తోంది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇద్దరు స్టార్ హీరోలు చేయనిది.. పవన్ కోసం..

ఇద్దరు స్టార్ హీరోలు చేయనిది.. పవన్ కోసం..


వేశ్య గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు అమ్మాయిలను రక్షించే లాయర్‌గా పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. అతడి కంటే ముందు హిందీలో అమితాబ్, తమిళంలో అజిత్ ఈ పాత్రను చేశారు. కథా బలమున్న సినిమా కావడంతో ఆ రెండు భాషల్లో హీరో ఎలివేషన్ కనిపించలేదు. కానీ, తెలుగులో మాత్రం పవన్ హీరోయిజం చూపించడానికి చాలా మార్పులు చేశారని తెలుస్తోంది.

పవన్ రీఎంట్రీ ఎంత స్పెషలో దీంతో తెలిసింది

పవన్ రీఎంట్రీ ఎంత స్పెషలో దీంతో తెలిసింది

సినిమాల్లో ఉన్నప్పుడు పవన్‌కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా అంతే స్థాయిలో ఉంది. ఈ విషయం ఇటీవల విడుదలైన ‘వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ పోస్టర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సుస్పష్టమైంది. అలాగే, ఆ తర్వాత విడుదలైన ‘మగువ మగువా' సాంగ్ కూడా భారీ స్థాయిలో స్పందనను రాబట్టింది. ఫలితంగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

పవన్‌కు ఊహించని దెబ్బ.. సినిమా వాయిదా

పవన్‌కు ఊహించని దెబ్బ.. సినిమా వాయిదా

రీఎంట్రీలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ‘వకీల్ సాబ్'తో పాటు క్రిష్, హరీశ్ శంకర్‌తో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఒక దాని తర్వాత ఒకటి చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే ‘వకీల్ సాబ్'ను మే 25న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో సినిమా వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Pawan Kalyan Didn't Use Even Caravan while Movie Shootings
కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కు రెండు పండుగలు

కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కు రెండు పండుగలు

‘వకీల్ సాబ్' వాయిదా పడిందన్న వార్తలు వస్తున్న సమయంలోనే ఆ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని ఓ న్యూస్ తాజాగా ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. దీని ప్రకారం... పవన్ కల్యాణ్ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కాబోతుందట. ఈ విషయాన్ని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X