పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ చెన్నైలో
చాలా కాలం విరామం తర్వాత పవన్ కళ్యాణ్ - సూర్య కలయికలో వచ్చిన చిత్రం 'ఖుషి" తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్నది 'కొమరం పులి". ఈ సినిమా ప్రధానాంశాలతో షూటింగ్ శరవేగంగా చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఈ సినిమా ద్వారా నిఖీషా పటేల్ కథానాయికగా పరిచయమవుతోంది.
శింగనమల రమేష్ నిర్మాత. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కొమరం పులి". ఇందులో ఆయన పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్న విషయం మనందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చెన్నై పరిసరాల్లో సాగుతోంది. పవన్ ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ సింగర్, మ్యూజిక్ డైరక్టర్ ఎఆర్ రెహమాన్ సుస్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలను కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.


Click it and Unblock the Notifications











