పవన్ కళ్యాణ్ చిత్రంపైనా భాను కిరణ్ ఎఫెక్టు పడనుందా?
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ తో హాస్య నటుడు నుంచి నిర్మాత గా ఎదిగిన గణేష్ కి సంభంధాలున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా గణేష్ నిర్మిస్తున్న లవ్ లీ(లవ్ ఆజ్ కల్ రీమేక్)చిత్రంపై ఈ ఎఫెక్టు పడనుందా అనే సందేహాలు అంతటా వినిపడుతున్నాయి. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ గత చిత్రం కొమురం పులి నిర్మాతలిద్దరూ (శింగనమల రమేష్, సి కళ్యాణ్) ఈ భాను కిరణ్ వ్యవహారంలో పూర్తిగా మునిగిపోయి ఉండటం, ఈ చిత్ర నిర్మాత పరిస్ధితి కూడా ఇలా కావటం హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఇప్పటికే ఇప్పటికే భారీ నిర్మాతలు సి.కళ్యాణ్, శింగనమల రమేష్ బాబుతో భానుకు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు వీరిని విచారించారు. ఇప్పుడు నిర్మాత గణేష్ పేరు బయటకు రావడంతో టాలీవుడ్‌తో భాను సంబంధాలపై పోలీసులు కూపి లాగుతున్నారు. గణేష్ చిన్న కమేడియన్ స్థాయినుండి భారీ నిర్మాతగా ఎలా ఎదిగాడనే విషయంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఒక్కో సినిమాకు కేవంల ముఫ్పై వేల రూపాయల లోపు రెమ్యునరేషన్ తీసుకునే గణేష్ భారీ చిత్రాలు ఎలా నిర్మించాడనే కోణాన్ని పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఓ ల్యాండ్ విషయంలో భానుకు, గణేష్ కు పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త పెరిగి గణేష్‌ను నిర్మాతగా ఎదిగేందుకు అవకాశం వచ్చినట్టుగా భావిస్తున్నారు. గణేష్ భానుతో కలిసి భూదందాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తదితర రంగాలలోకి గణేష్ దిగటం వల్లనే కమేడియన్‌గా తెరపై కనిపించడం లేదని వినపడుతోంది.గణేష్ తన తొలి చిత్రంగా భారీ బడ్జెట్ తో రవితేజతో ఆంజనేయులు చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఇక గణేష్ కీ భానుకీ సంభందాలు ఉన్నట్లు రుజవయితే గ్యారెంటీగా లవ్ లీ చిత్రంపై ఆ ఎఫెక్టు పడుతుంది.


Click it and Unblock the Notifications











