అదిరిపోవాలంతే: మహేష్, పవన్ కలిసి లైవ్ ఫెర్ఫార్మెన్స్

By Srikanya

హైదరాబాద్ :హుద్‌హుద్‌ బాధితులను ఆదుకోవడానికి చిత్రపరిశ్రమ ముందుకొచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు వ్యక్తిగతంగా స్పందించి తమకు తోచిన సాయం చేశారు. ఇప్పుడు చిత్రసీమ యావత్తు కలసి కట్టుగా 'మేము సైతం' అంటూ భరోసా ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. హుద్‌హుద్‌ బాధితులకు బాసటగా తెలుగు చిత్రసీమ ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.

ఈ వేడుక నవంబర్ 30న హైదరబాద్ లో భారీగా గా జరగనుంది. ఈ స్టార్ నైట్ ఈవెంట్ ని హిట్ చేయడం కోసం చిత్ర పరిశ్రమ అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది. దాదాపు 13 గంటల పాటు కంటిన్యూగా లైవ్ లో జరిగే ఈ లైవ్ టెలీథాన్ లో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా స్టేజ్ పైన పెర్ఫార్మన్స్ ఇవ్వటానికి ప్రిపేర్ అవుతున్నారు.

ఇక ఆ రోజు స్టేజ్ పై పెర్ఫార్మన్స్ చేసే వారి లిస్టులో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు కూడా ఉండటం విశేషం. వీరిద్దరూ చేసే ప్రోగ్రాంకి సంబంధించిన డిజైన్ మరియు ప్రోగ్రాం స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ చేస్తున్నాడు. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబులు ఒకేసారి లైవ్ లో స్టేజ్ పైన ఒక పెర్ఫార్మన్స్ ఇవ్వడం అనేది జరగలేదు. దాంతో ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈ పోగ్రాం అద్బుతంగా జరుగుతుందని భావిస్తున్నారు.

 Pawan & Mahesh gonna Perform Live!

మరో ప్రక్క ఈ పోగ్రాం లో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన బ్యాండ్ తో కలసి రాకింగ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. తమిళ పరిశ్రమ నుండి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు హాజరవుతున్నారు.

''వ్యక్తిగత విరాళాలకు మించి ఒక సమష్టికృషినీ, ప్రయత్నాన్నీ ప్రేరేపించాల్సిన బాధ్యత తెలుగు సినీ పరిశ్రమకు ఉంది. అందుకే ఈ నెల 30న 'మేము సైతం' పేరిట ఓ వినోద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న తెలుగువారంతా స్పందించి, తుపాను బాధుతులను ఆదుకోవడానికి ముందుకొచ్చేలా చేయడమే కార్యక్రమ ఉద్దేశమ''ని అల్లు అరవింద్‌, 'మా' అధ్యక్షుడు మురళీమోహన్‌ తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, విరాళాలు అందజేయాలనుకొనేవాళ్లు www.memusaitam.com చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X