పవన్, మహేష్ ఇద్దరూ ఒకే స్టేజీపై...

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఒకే స్టేజిపై కనిపించనున్నారా అంటే... అవుననే వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయనున్నారని తెలుస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి టైటిల్ తో రూపొందుతున్న చిత్రం ఆడియో పంక్షన్ కి వీరిద్దరూ రానున్నట్లు సమాచారం. మార్చి 14న ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది. ఈ పంక్షన్ చాలా గ్రాండ్ గా చేయాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అల్లు అర్జున్‌ను తెరపై 'జులాయి'గా చూపించి ప్రేక్షకులకు వినోదాలు పంచారు త్రివిక్రమ్‌. ఆ ఇద్దరి కలయికలో ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతోంది. సమంత, నిత్యమేనన్‌, ఆదాశర్మ కథానాయికలు. రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.

Pawan & Mahesh meeting on March 14 th

త్రిశూలం, హుషారు, జాదూగర్ వంటి టైటిల్స్ పరిశీలనలకో వచ్చినా కథ ప్రకారం ఇదే సరైన టైటిల్ అని దర్శకుడు, హీరో భావించినట్లు సమాచారం. మార్చి చివరలో కాని,ఏప్రియల్ మొదటి వారంలో కానీ ఈ చిత్రం విడుదల అవనుంది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా పడుతుందని చెప్తున్నారు. తండ్రి కొడుకుల రిలేషన్ కూడా కథలో ప్రధానంగా సాగుతుందని అంటున్నారు.

వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది.

ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరో ప్రక్క ఈ చిత్రం పూర్తవగానే మహేష్ ,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభం కానుంది. జూలాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2015 ఆగస్టు నుంచి ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలు ఎక్కవచ్చు. ఈ మేరకు ఎగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటికి మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని ఫినిష్ చేసుకుని రెడీ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X