పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’గా రిస్క్ తీసుకుంటున్నాడా?
పవన్ కళ్యాణ్ రిస్క్ తీసుకుంటున్నాడా..? అంటే అవుననే అనిపిస్తుంది. ఇటీవలే పోలీసాఫీసర్ గా కొమరంపులిలో నటించి చేతులు కాల్చుకున్న పవన్ కళ్యాణ్ అది సరిపోదన్నట్టు మరోసారి పోలీస్ క్యారెక్టర్ కోరుకుంటున్నాడు. దబాంగ్ రీమేక్ కి సై అంటున్నాడు. ప్రస్తుతం జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'లవ్లీ" సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మార్చికల్లా పూర్తవుతుందని పవన్ కళ్యాణ్ భావించాడట. కానీ జయంత్ పక్కా ప్లానింగ్ తో నెల రోజుల ముందే ఈ షూటింగ్ ని పూర్తి చేసాడు.
దాంతో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయడానికి గ్యాప్ దొరికిందని తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్" చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు. మిరపకాయ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ డైరక్షన్లో దబాంగ్ రీమేక్ అదీ సొంతగా ప్రొడ్యూస్ చేస్తాడట. గబ్బర్ సింగ్ సినిమాని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో తీస్తానంటున్నాడు. మిరపకాయ్ సినిమా అంచనాలు అందుకోలేకపోయినా, ఆ డైరెక్టర్ ని పిలిచి ఛాన్సివ్వడంలో పవన్ ఆంతర్యమేంటో..


Click it and Unblock the Notifications











