టీడీపి,బిజీపీ లకు పవన్ ట్విస్ట్...మరో పార్టికి క్యాంపైన్

By Srikanya

హైదరాబాద్ : జనసేన సేనాని పవన్ కల్యాణ్ కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టిలన్నిటి కోసం వరసగా ఎలక్షన్ క్యాంపైన్ నిర్వహించాలనుకుంటున్నట్లున్నారు. అంతా తెలుగుదేశం కోసం ఆయన పనిచేస్తారనుకుంటే తాజాగా ఆయన లోక్ సత్తా పార్టీ కోసం క్యాంపైన్ చేయటానికి సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం లోక్ సత్తా పార్టీ ఎలక్షన్ క్యాంపైనైర్ లిస్ట్ ని ఎలక్షన్ కమీషనర్ కి పంపిన దాంట్లో ఉంది. పవన్ మాత్రమే కాక రాజమౌళి, సిరివెన్నెల, తమ్మారెడ్డి వంటి ఇరవై మంది స్టార్ క్యాంపైనర్స్ ఈ పార్టీ లిస్ట్ లో ఉన్నారు.

గతంలో పవన్ ని లోక్ సత్తా పార్టీ అధ్యక్ష్యుడు జయప్రకాష్ నారాయణ ఆహ్వానించారు. ఆయన అప్పుడు మాట్లాడుతూ..లోక్ సత్తా అనేది ఏ ఒక్కరికో చెందిన పార్టీ కాదని, ఎవరైతే బెటర్ సొసైటీ కోసం పనిచేయాలనుకుంటారో వారందరిదీ అని,వారిని ఆహ్వానిస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే సంతోషమే అని అన్నారు. ఇప్పుడది నిజం కాబోతున్నట్లుంది. పార్టీలో జాయిన్ కాకపోయినా పార్టీకి సపోర్టు ఇస్తారని తెలుస్తోంది.

Pawan name submitted to EC as star campaigner

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పైగా ఇతర పార్టీల తరుపున ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లకు తన మద్దతు ప్రకటించారు. సినిమా తారల్లో పార్టీ స్థాపించిన తర్వాత ఇలా చేసిన వారు ప్రపంచంలో ఎవరూ లేక పోవడం వరల్డ్ర్ రికార్డే అంటున్నారు.

కాగా...విశాఖపట్నం సభ తర్వాత పవన కళ్యాణ్ సైలెంట్ అయిపోయారు. విశాఖలో జరిగిన సభ కాస్త చప్పగా మారిందన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇది తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దం లాంటిదని, ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత పవన్ కళ్యాణ్ తన తడాఖా చూపెట్టబోతున్నారని అంటున్నారు అభిమానులు. త్వరలో పవన్ మూడో సభ ఏర్పాటు చేయబోతున్నాడట.

మరోవైపు పవన్ కళ్యాణ్ తన 3వ సభ ద్వార బిజెపికి ప్రచారం చేయడానికి సిద్ధపడుతున్నట్లు చెపుతున్నారు. దీనికి బలం చేకూర్చుతున్నట్లు పవన్ శనివారంనాడు తన అభిమానులతో సమావేశమవడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రచార వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X