'గబ్బర్‌ సింగ్' సీక్వెల్ కు టైటిల్ ఖరారు

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయ్యి కొత్త రికార్డుల క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ హిట్ కి సీక్వెల్ ని చేయటానికి నిర్మాత గణేష్ బాబు ఫిక్సైపోయారంటూ వార్తలు వచ్చాయి. కానీ సీక్వెల్ వచ్చే అవకాసం ఉందా అని చాలా మందికి సందేహాలు కలిగాయి. అయితే ఇప్పుడు గణేష్ ...'గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్ ' టైటిల్ ని రిజిస్టర్ చేయబోతున్నారు. దాంతో ఖచ్చితంగా సీక్వెల్ వస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే హరీష్ శంకరే దర్శకుడా మరొకరు ఉంటారా అనేది మాత్రం తెలియలేదు.

మరో ప్రక్క గణేష్ బాబు....త్వరలో పవన్ తో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్‌కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు. నేను పవన్‌కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు. దబాంగ్ 2 రైట్స్ సల్మాన్ ఖాన్ ఇస్తామని తనకు ప్రామిస్ చేసారని చెప్పారు.

ప్రస్తుతం ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రానున్న 'బాద్‌షా' పనిలో ఉన్నాననీ, అలాగే పూరిజగన్నాథ్‌తో రెండు సినిమాలు చేయబోతున్నాననీ, అల్లు అర్జున్ తో ఒకటి మొదలయ్యిందని గణేష్ తెలిపారు. కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో ఆనందపడ్డాడు అన్నారు. గబ్బర్ సింగ్ సినిమా సాధించిన విజయం చూసి బాలీవుడ్ సినిమారంగం విస్తుపోయింది. నా దృష్టిలో ఇంతటి సంచలనం ఒక రజనీకాంత్, ఒక పవన్‌కళ్యాణ్‌లకు మాత్రమే సాధ్యం అన్నారు. రజనీకాంత్, సల్మాన్‌ఖాన్ లాంటి వాళ్లు ఈ సినిమా చూసి ప్రశంసించారని గణేష్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X