పవన్ కళ్యాణ్... న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ?

By Bojja Kumar

హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో 2012వ సంవత్సరం పూర్తయి 2013 సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా సందడే సందడి. సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు కొత్త సంవత్సర వేడుకలను తమ తమ స్థాయికి తగ్గట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

సినీ స్టార్స్ అంటే జనాల్లో మహా క్రేజ్. వారు కనిపిస్తే చాలు వారితో మాట్లాడటానికి, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఆటో గ్రాఫులు తీసుకోవడానికి పోటీ పడుతుంటారు. ఇలాంటి చర్యలు అభిమానులకు మహా ఆనందాన్ని ఇచ్చినా.... స్టార్స్‌కు మాత్రం ఇబ్బంది పడే అంశమే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వారు లోకల్ గా ఉండి ఎలాంటి వేడుకల్లో పాల్గొన్నా కష్టంగానే ఉంటుంది.

అందుకే చాలా మంది స్టార్స్.... విదేశాల్లోనే ఇలాంటి వేడుకలు జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అక్కడయితే అభిమానుల గోల ఉండదు కాబట్టి. ఇప్పటికే మహేష్ బాబు తన ఫ్యామిలీతో పాటు ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేయగా.... మరో స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విదేశాల్లోనే న్యూఇయర్ వేడుకలను జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'సరదా'(తాత్కాలిక టైటిల్) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 26న ఈ చిత్ర షూటింగ్ స్పెయిన్లో ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి అక్కడే న్యూఇయర్ సంబరాల్లో పాల్గొనబోతున్నారు.

ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్‍‌గా చేస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈచిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు. నటీనటుల వివరాలు, ఇతర సాంకేతిక విభాగం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X