twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    3D చిత్రంలో పవన్.. డిటేల్స్

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ ఓ 3D చిత్రం కమిటయ్యారని తాజా సమాచారం. తమిళ దర్సకుడు ఎస్ జె సూర్య రచించిన ఓ స్టోరీ లైన్ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తో ఊసరవెల్లి చిత్రం నిర్మించిన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా కామిడీ చిత్రం. హాలీవుడ్ చిత్రం హ్యాంగోవర్ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన నలుగురు బ్యాచులర్ రూమ్ మేట్స్ చుట్టూ తిరిగే కథ ఇది.

    ఈ చిత్రంలో ఇరవై సీన్స్ మాత్రమే ఉంటాయని, చాలా తక్కువ బడ్జెట్ లో చిత్రం రూపొందించాలని పవన్ ప్లాన్ అని చెప్తున్నారు. అలాగే చిత్రం పిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామిడీగా మలిచేందుకు ఇలియానా డేట్స్ అడుగుతున్నారని నిర్మాతకు చెందిన వారి ద్వారా తెలుస్తోంది. ఇక పవన్ స్నేహితుల్లో ఒకరుగా వైభవ్ నటించనున్నారు. హిందీలో డిల్లీ భెల్లీ తరహాలో ఈ కామిడీని రూపొందించి హిట్ కొట్టి తెలుగులో కొత్త ట్రెండ్ కు తెరలేపాలని పవన్ ఆలోచన అని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న గబ్బర్ సింగ్ లో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పంచ్ డైలాగులతో అలరిస్తుందని చెప్తున్నారు.

    English summary
    Pawan Kalyan is now relying heavily on a comedy film in 3D, to be produced by B.V.S.N. Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X