గబ్బర్ సింగ్ రికార్డుల పై పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ప్రతీ విషయంలో ఆచి తూచి అడుగువేస్తూంటారు. గబ్బర్ సింగ్ విషయంలో అదే జరుగుతోంది. గబ్బర్ సింగ్ కలెక్షన్స్ సునామీలా కురుస్తూ రికార్డుల క్రియేట్ చేస్తూంటే పవన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఆయన తన నిర్మాత బండ్ల గణేష్ పిలిచి ..కలెక్షన్స్ గురించి ప్రెస్ స్టేట్ మెంట్స్ ఇవ్వద్దని స్ట్రిక్ట్ గా చెప్పారని సమాచారం. హీరోల ఫ్యాన్స్ మధ్యన చిచ్చు రగిల్చే విధంగా కలెక్షన్స్,రికార్డుల గురించి అఫీషియల్ గా స్టేట్ మెంట్ ఇవ్వద్దని ఆదేశించారని,అందుకే గణేష్ ఈ విషయమై మాట్లాడటం లేదని తెలుస్తోంది.
ఇక పవన్ మాత్రం నా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు..అది చాలు అని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే పవన్ ఆర్డర్ మేరకు గణేష్ ఈ చిత్రం కలెక్షన్స్ పిగర్స్ ని బయిట పెట్టడం లేదు. మరో ప్రక్క బయిట మాత్రం ఈ చిత్రం మిగతా హీరోల చిత్రాల కలెక్షన్స్ ని క్రాస్ చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పంజా సమయంలో నిర్మాతలు చిత్రం కలెక్షన్స్ మొదటి రోజే ప్రకటించారు. అలాగే పులి సమయంలోనూ కలెక్షన్స్ ప్రస్తావన వచ్చింది. అయిత ఇంత పెద్ద హిట్టన గబ్బర్ సింగ్ కలెక్షన్స్ రికర్డుల గురించి మాట్లాడుకోవటానికి లేకపోటం అభిమానులను మాత్రం కాస్త నిరాశపరుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఈ చిత్రం విజయం గురించి చెప్తూ...మన తెలుగు ఆడియన్స్ చాలా ఎంటర్టన్మెంట్ కోరుకుంటారు..అలాగే ఫార్మెట్ ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని కొత్తగా చెప్పటం చాలా కష్టం. హరీష్ ..కథని ఎలా ఎడాప్ట్ చేసుకుంటే బావుంటుందో..ఎలా కన్వే చేస్తే బావుంటుందో తెలుసు. అంతకు ముందు కూడా నేను మిరపకాయ చేయాల్సింది కానీ..వేరే కారణాల వల్ల నేను చెయ్యలేకపోయాను..అప్పటి నుంచీ నాకు తెలుసు..అతను ప్రతీ హీరోకి ఎడాప్ట్ అవ్వగలడు అన్నారు.
అలాగే హరీష్ శంకర్ స్కిల్స్ లో డైలాగులు ఒకటే కాకుండా ఒక్కోసారి..కొంతమంది కథను బాగా రాయగలరు..రాసినంత బాగా తెరకెక్కించలేరు..హరీష్ ఎంత బాగా రాయగలడో అంత కన్నా ఇంకా బాగా తెరకెక్కించగలడు..చాలా పాస్ట్ అతను..అతని పేస్ తట్టుకోలేము..సాధారణంగా ఒక షాట్ కోసమో,మరో దాని కోసమో వెయిట్ చేస్తూంటే సహనం చచ్చిపోతుంది..హరీష్ దగ్గర ఆ ఎంతూయాజమ్ అలాగే ఉంటుంది. టైమ్ ని వేస్ట్ చేయడు. అలాగే హరీష్ దగ్గర మెక్యూరి ధింకింగ్ ఉంది. చాలా పాస్ట్ గా ఛేంజి కావాలంటే చేసి చూపించగలడు. అతను కథా పరంగానే కాకుండా తీసే విధానం, అందరితో నడుచుకునే విధానం చాలా బాగుంది.


Click it and Unblock the Notifications











