హాట్ టాపిక్ : పవన్ కళ్యాణ్ స్క్రిప్టు రాస్తున్నారు

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ క్రియేటివ్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఫైట్స్,డాన్స్ దగ్గరనుంచి ప్రత్యేకంగా డిజైన్ చేసుకునే ఆయన తాజాగా ఓ స్క్రిప్టు రాయటం మొదలుపెట్టారని వార్త ఆయన అభిమానుల్లో ఆనందం పంచుతోంది. ఆయన కెరీర్ లో సూపర్ హిట్ అయిన 'గబ్బర్ సింగ్' చిత్రానికి సీక్వెల్ గా నిర్మించే చిత్రానికి ఆయనే రచన చేస్తున్నాడని వినికిడి. ఇక ఈ చిత్రాన్ని ఆయన స్వంతంగా తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తారని తెలుస్తోంది.

నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది... అంటూ 'గబ్బర్‌సింగ్‌'గా పవన్‌ కల్యాణ్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మొండిఘటం పోలీసు పాత్రలో ఆయన పంచిన వినోదం ప్రేక్షకుల్ని అలరించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా త్వరలో 'గబ్బర్‌సింగ్‌ 2' తెరకెక్కబోతోంది. పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై ఆయనే నిర్మిస్తారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నట్టు సమాచారం.

తొలిభాగంలో పవన్‌కల్యాణ్‌ పోషించిన గబ్బర్‌సింగ్‌ పాత్ర శైలి, అందులోని భావోద్వేగాలు రెండో భాగంలోనూ కొనసాగుతాయని తెలిసింది. దర్శకుడు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు పవన్‌. ఆ సినిమా పూర్తవగానే రెండో గబ్బర్‌సింగ్‌ సెట్స్‌పైకి వెళుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X